/rtv/media/media_files/2026/04/21/fraudsters-offer-ships-strait-of-hormuz-passage-in-exchange-for-crypto-2026-04-21-20-14-23.jpg)
Fraudsters offer ships Strait of Hormuz passage in exchange for crypto
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల హర్మూజ్ జలసంధి వద్ద అంతరాయం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని అంతర్జాతీయ నౌకలను బురిడీ కొట్టించే కొత్త మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇరాన్ నౌకల రాకపోకలపై అమెరికా దిగ్బంధనం విధించడంతో వందలాది నౌకలు సముద్రంలోనే నిలిచిపోయాయి. ఈ అనిశ్చితిని కొందరు దోపిడీదారులు ఆసరగా తీసుకోని ఇరాన్ అధికారుల వేషంలో నౌకలపై అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.
Fraudsters Offer Ships Strait Of Hormuz Passage
అంతేకాదు క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లింపులు చేస్తే నౌకలను సురక్షితంగా జలసంధి దాటిస్తామంటూ ఈ దోపిడీదారులు ఆశ చూపిస్తున్నారు. బిట్‌కాయిన్, టెథర్ లాంటి డిజిటల్ కరెన్సీలను డిమాండ్ చేస్తూ మోసపూరిత హామీలు ఇస్తున్నారు. ఈ వ్యవహారంపై గ్రీక్ మ్యారిటైమ్ రిస్క్ మేనేజ్‌మెంట్ సంస్థ 'మారిస్క్స్' స్పందించింది. నౌకల యజమానులు అలెర్ట్‌గా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ అధికారులు ఇలాంటి చెల్లింపులను చేయాలని అడగరని.. ఇది పూర్తిగా మోసమని పేర్కొంది.
Also Read: దేశంలో భారీగా పతనమైన ఎరువుల ఉత్పత్తి ..కేంద్రం కీలక నిర్ణయం
పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభానికి ముందు హర్మూజ్ జలసంధి నుంచి ప్రపంచ చమురు 20 శాతం రవాణా అయ్యేది. కానీ హర్మూజ్‌ను ఇరాన్ అధినంలోకి తీసుకోవడం, ఆ తర్వాత అమెరికా దిగ్బంధించడం లాంటి పరిస్థితుల వల్ల ప్రపంచ వాణిజ్యానికి ఆటంకం ఏర్పడింది. కానీ ఇప్పుడు అక్కడ కూడా సైబర్, ఆర్థిక నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
Follow Us