/rtv/media/media_files/2025/02/17/Kz2EwuQAjHNZmWwdbVNV.jpg)
praminda
నగదు అక్రమ రవాణా కేసులో మారిషస్ మాజీ ప్రధాని ప్రవింద జగన్నాథ్‌ను పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ కేసులో ఇతర అనుమానితుల ఇళ్లల్లో రైడ్లు జరిపి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.మనీ లాండరింగ్ కేసులో మాజీ ప్రధానితో పాటు ఆయన భార్య కోబితను ప్రశ్నించేందుకు శనివారమే వారిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Zelenskyy: వారి సాయం లేకుండా మేం బతకడం కష్టమే.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు
కొన్ని గంటల పాటు వారిని విచారించిన అనంతరం అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఆ తరువాత కోబితను విడుదల చేసినప్పటికీ ప్రవింద్ జగన్నాథ్‌ను మాత్రం తమ ఆధీనంలోనే ఉంచారు. ‘‘తనపై వచ్చిన ఆరోపణలను మాజీ ప్రధాని ఖండించినట్టు ఆయన తరపు లాయర్ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి తన వాదనను పోలీసులకు వెల్లడించినట్టు తెలిపారు. త్వరలో ఆయనను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు.
Also Read: MK-84 Bombs: అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు చేరుకున్న MK-84 బాంబులు.. ఏ క్షణమైనా యుద్ధం..!
లగ్జరీ చేతి గడియారాలు...
ఈ కేసుకు సంబంధించి ఓ వ్యక్తి ఇంట్లో తనిఖీలు నిర్వహించామని, ఈ సందర్భంగా మాజీ ప్రధాని, ఆయన భార్య పేర్లు ఉన్న కొన్ని దస్త్రాలను సీజ్ చేశామని తెలిపారు. పలు లగ్జరీ చేతి గడియారాలు, వివిధ దేశాల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
2017-24 మధ్య కాలంలో ప్రవింద్ మారిషస్‌కు ప్రధానిగా చేశారు. మారిషస్ రాజకీయాల్లోని ప్రముఖ కుటుంబాల్లో ప్రవింద్ కుటుంబం కూడా ఒకటి. బ్రిటన్ నుంచి 1968లో స్వాతంత్ర్యం పొందిన అనంతరం మారిషస్ మంచి అభివృద్ధి సాధించింది.ఇక ప్రవింద్ హయాంలో బ్రిటన్ ఛాగోస్ ఐల్యాండ్‌ను మారిషస్‌కు అప్పగించింది. అయితే, నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూశారు. ఈ ఎన్నికల్లో నవీన్ రామ్‌గులామ్ విజయం సాధించి ప్రధాని బాధ్యతలు స్వీకరించారు.
కాగా, ఛాగోస్‌కు సంబంధించి మరింత పరిహారం కోరుతూ మారిషస్ మరోసారి బ్రిటన్‌తో చర్చలు ప్రారంభించింది. అయితే, ఈ అంశంపై తుది నిర్ణయం అమెరికా ప్రభుత్వానిదేనని బ్రిటన్, మారిషస్ పేర్కొన్నాయి. ఆసియా పెసిఫిక్ ప్రాంతంలో ముఖ్యమైన మిలిటరీ స్థావరంగా ఉన్న ఈ ద్వీప సముదాయాన్ని బ్రిటన్ అమెరికాకు అద్దెకు ఇచ్చింది.
Also Read: VIRAL VIDEO: రేయ్ ఎవర్రా మీరంతా..! బర్డ్‌ఫ్లూ భయమే లేదు: ఊరంతా చికెన్ పండగే!
India-China: ట్రంప్ టారిఫ్ దెబ్బకి మెరుగుపడుతున్న భారత్-చైనా సంబంధాలు
ట్రంప్ టారిఫ్‌ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. కానీ భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ వెల్లడించారు.
Jai shankar
ట్రంప్ టారిఫ్‌ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. కానీ భారత్-చైనా సంబంధాలు మాత్రం బలపడే దిశగా వెళ్తున్నాయి. తాజాగా ఇరుదేశాల సంబంధాలపై విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. ఆ సంబంధాలు సానుకూల దిశ వైపు పయనిస్తున్నాయన్నారు. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని.. వీటిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ఎంతో కృషి చేయాల్సి ఉందని అన్నారు.
Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్
ఇదిలాఉండగా 202-0 లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల జవాన్ల మధ్య ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారత్-చైనా మధ్య సంబంధాలు దిగజారిపోయాయి. అనంతరం సైనిక, దౌత్యపరంగా చర్చలు జరగడం, గస్తీ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇరుదేశాలకు స్వేచ్ఛగా వెళ్లొచ్చు .
Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్
ఇటీవల చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 108 శాతం టారిఫ్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా చైనా కూడా అమెరికాపై 84 శాతం సుంకాలు విధించింది. దీంతో ట్రేడ్ వార్ మరింత ముదిరింది. ఇదిలాఉండగా.. న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ టారిఫ్‌ల స్పందించారు. అమెరికా టారిఫ్ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, చైనా జత కట్టాలన్నారు. పరస్పర సహకారం, ప్రయోజనాలపై ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్యం సంబంధాలు ఆధాపడి ఉన్నాయన్నారు. అమెరికా విధించిన టారిఫ్‌ల వల్ల అనేక దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు అభివృద్ధి పొందే హక్కును కోల్పోతున్నాయని చెప్పారు. ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి బయటపడేందుకు మన ఇరు దేశాలు కలిసి ఎదుర్కోవాలన్నారు.
Also read: Viral video: రన్నింగ్ ట్రైన్ కిటికీలో ఇరుక్కున్న దొంగ.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన ప్యాసింజర్
telugu-news | rtv-news
భారీ వర్షం.. పిడుగులు పడి 13 మంది మృతి
Urvashi Rautela: దబిడి దిబిడి భామకు గోల్డెన్ క్వీన్ అవార్డు..
BIG BREKING: రాజమండ్రిలో RGVపై మరో పోలీస్ కేసు..!
GT Vs RR: గుజరాత్ తొలి ఇన్నింగ్స్ పూర్తి.. రాజస్తాన్ టార్గెంట్ ఎంతంటే?
Ladies Hostels : అర్థరాత్రి దొంగ హల్ చల్ లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి...