/rtv/media/media_files/2025/03/14/YSEkbD0rADFEJZROu5Tb.jpg)
India slams Pakistan over 'baseless' train hijack remark
ఇటీవల పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో బలూచ్ మిలిటెంట్లు ట్రైన్‌ను హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. ట్రైన్ హైజాక్ వెనుక భారత్ హస్తముందని పాకిస్థాన్ మరోసారి విషం చిమ్మే ప్రయత్నం చేసింది. పొరుగుదేశాలను అస్థిరపరిచేందుకు భారత్ కృషి చేస్తోందని పిచ్చి కూతలు కూసింది. అయితే తాజాగా దీనిపై భారత్ స్పందించింది ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం అంతటా తెలుసని విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
Also Read: వీడేం మనిషండీ బాబు.. పొరుగింటి వారితో గొడవ.. కారుతో ఢీకొట్టడంతో తలకిందులుగా వేలాడిన మహిళ!
ఇటీవల బలూచిస్థాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) వేర్పాటువాదులు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన వెనుక భారత్ ఉందని పాకిస్థాన్ విదేశాంగ అధికార ప్రతినిధి షఫ్‌ఖత్ అలీఖాన్ అన్నారు. తమ దేశానికి వ్యతిరేకంగా భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని తెలపారు. భారత్ మీడియా బీఎల్‌ఏను కీర్తిస్తోందని ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలోనే షఫ్‌ఖత్ అలీఖాన్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ కౌంటర్ వేశారు. '' పాకిస్థాన్ విదేశీ విధానంలో ఎలాంటి మార్పు కూడా లేదు. పాక్ నిరాధార ఆరోపణలు చేస్తోంది. వాళ్లు ఇతరుల వైపు వేళ్లు చూపించే బదులు తమ అంతర్గతంగా ఉన్న సమస్యలపై దృష్టిపెడితే బాగుంటుంది. ఉగ్రవాదనికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచమంతా తెలుసని'' రణ్‌ధీర్ జైస్వాల్ అన్నారు.
Our response to media queries on the remarks made by the Pakistan side ⬇️
— Randhir Jaiswal (@MEAIndia) March 14, 2025
🔗 https://t.co/8rUoE8JY6A pic.twitter.com/2LPzACbvbf
Also Read: వీధికుక్క నోట్లో అప్పుడే పుట్టిన పసికందు.. 45 రోజుల్లో మూడో ఘటన
ఇదిలాఉండగా బలోచిస్థాన్ వేర్పాటు వాదులు 400 మందితో ప్రయాణస్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేశారు. రైలు మార్గంలో 17 సొరంగాలు ఉండగా.. 8వ సొరంగం వద్ద రైల్వే ట్రాక్‌ను పేల్చి తమ అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 33 మంది మిలిటెంట్లను చంపేసినట్లు పాకిస్థాన్ సైన్యం ప్రకటన చేసింది. కొంతమంది ప్రయాణికులను రక్షించింది. మిగిలినవారని కాపాడేందుకు ఆపరేషన్ కొనసాగిస్తోంది.
Also Read: పాలక్కాడ్‌లో అత్యధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు...రెడ్ అలర్ట్!