/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-11-10.jpg)
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వానికి కీలక సలహాదారుడు ఎలాన్ మస్క్. ఇతను డిపార్టుమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(DOGE)కు అధినేత కూడా. ట్రంప్ వచ్చిన దగ్గర నుంచీ DOGE అనేక చర్యలను చేపట్టింది. ఫెడరల్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే ఇప్పుడు ఎలాన్ మస్క్ DOGEనుంచి తప్పుకుంటున్నారని తెలుస్తోంది. టెక్ బిలియనీర్ మస్క్ దీన్ని స్వయంగా ప్రకటించారు. అంతే కాదు ఈయన ఏకంగా వాషింగ్టన్ వీడి వెళతారని తెలుస్తోంది.
1 ట్రిలియన్ డాలర్లను సేవ్ చేశాం..
ఫాక్స్ న్యూస్ ప్రకారం.. ఎలాన్ మస్క్ ట్రంప్ టీం నుంచి మే నెలలో వైదొలగనున్నారు. ప్రభుత్వానికి 1 ట్రిలియన్ డాలర్ల భారం తగ్గించాం. కాబట్టి తాను వచ్చిన పని అయిపోయిందని ఎలాన్ మస్క్ చెబుతున్నారు. మే 2025లో వార్షిక ఫెడరల్ లోటును సగానికి అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. తన బృందం రోజుకు 4బిలియన్ డాలర్ల లోటును సరిచేస్తూ వారంలో ఏడు రోజులు కష్టపడి పనిచేశామని మస్క్ చెప్పుకొచ్చారు. DOGE మే 2025లోపు దాదాపు 7 ట్రిలియన్ల డాలర్లనుంచి 6 ట్రిలియన్ల డాలర్లకు తగ్గించగలదని గట్టి నమ్మకని చెప్పారు. అందుకే DOGE ను వదిలేస్తానని అంటున్నారు.
అంతకు ముందు తమ డీవోజీఈ సిబ్బంది వారానికి 120 గంటలు పనిచేస్తున్నారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కానీ అమెరికా ఉన్నతస్థాయి అధికారులు మాత్రం వారానికి కేవలం 40 గంటలు మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. అందుకే పౌరులు చెల్లిస్తు్న్న సొమ్ము వృథా అవుతోందని పేర్కొన్నారు. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థపై DOGE చేస్తున్న ఆడిట్‌లో కీలక విషయాలు బయటపడుతున్నాయని.. ప్రజల డబ్బులు ఎలా దుర్వినియోగమవుతున్నాయో తెలుస్తోందని చెప్పారు.
today-latest-news-in-telugu | usa | elon-musk
Also Read: Mynmar Earthquake: మయన్మార్ లో తరుచూ భూకంపాలు..అక్కడ భూమి కింద ఏముంది?