/rtv/media/media_files/2025/02/14/7jDF2S2WVY8yzSPDBlPY.jpg)
elon musk modi Photograph: (elon musk modi)
X CEO ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలతో వింత నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా అమెరికాలో ఏర్పడిన ట్రంప్ గవర్నమెంట్ ఎలన్ మస్క్‌కు పెద్ద బాధ్యతలు అప్పగించింది. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ గురువారం వాషింగ్టన్‌లో ఎలన్ మస్క్ ఫామిలీని కలిశారు. ఎలన్ మస్క్, ఆయన కుటుంబ సభ్యులతో సరదాగా ముచ్చటించారు. వారికి ఇండియా నుంచి తీసుకెళ్లిన గిఫ్ట్‌లు కూడా ఇచ్చాడు ప్రధాని మోదీ.
It was also a delight to meet Mr. @elonmusk’s family and to talk about a wide range of subjects! pic.twitter.com/0WTEqBaVpT
— Narendra Modi (@narendramodi) February 13, 2025
Also Read: పుల్వామా అటాక్ చేసినవాళ్లను ఇండియన్ ఆర్మీ ఏం చేసిందో తెలుసా?
ప్రస్తుతం డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ ఇంఛార్జ్‌గా ఎలన్ మస్క్‌కు ట్రంప్ బాధ్యతలు అప్పించారు. దీంతో అమెరికా అడ్మినిస్ట్రేషన్‌లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెరికాలో ఎలన్ మస్క్‌ను మోదీ కలిసినప్పుడు ఓ విలువైన గిఫ్ట్ ఇచ్చాడు. దాని గురించి ప్రసెంట్ ఇంటర్‌నెట్‌లో చర్చ జరుగుతోంది. చూడడానికి మామూలుగా ఉన్న అది చాలా విలువైనది. వేల కోట్లుకు అధిపతి అయిన ఎలన్ మస్క్ ఓ దేశ ప్రధానికి బహుమతి ఇచ్చాడంటే అది చాలా విలువైనదే అని కొందరు భావిస్తున్నారు. ఎలన్ మస్క్ మోదీకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే..
Elon musk gifted Our Honourable Prime Minister , Modi sir, a piece of Heat Tile that flew on 5th test flight of Starship on October 13 , 2024. Giving space relics should become mainstream gifting culture now. 🇮🇳🙏 pic.twitter.com/nL44riX4ND
— Radha Krishna Kavuluru (@iamkrishradha) February 14, 2025
ఎలన్ మస్క్‌కు స్పేస్‌ఎక్స్ అనే అంతరిక్ష సంస్థ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ స్పేస్ ఎక్స్‌కు చెందిన స్టార్‌షిప్ రాకెట్ హీట్ షీల్ట్ టైలే ఎలన్ మస్క్ భారత ప్రధాని నరేంద్ర మోదీ బహుమతిగా ఇచ్చాడు. అది ఓ అరుదైన మెటల్‌తో చేసిన పరికరం. స్టార్‌షిప్ హీట్‌షీల్డ్ టైల్స్ అనేవి షట్కోణ సిరామిక్ టైల్స్, వాతావరణంలో మార్పుల నుంచి రాకెట్‌ను రక్షించడానికి తయారు చేస్తారు. అంతరిక్షంలో వేగంగా ప్రయాణించే రాకెట్‌ను తీవ్ర ఉష్ణోగ్రతల నుంచి ఈ సిలికా ఆధారిత సిరామిక్‌తో తయారు చేసిన స్పేస్ షటిల్ టైల్ కాపాడుతుంది. ఇవి అంతరిక్ష నౌకలకు వేడి అంతటా ఒకేలా ప్రసరింపుజేసేలా చేస్తాయి. అంతేకాదు రాకెట్‌ను కూల్ చేస్తాయి. అదే ఇప్పుడు ఎలన్ మస్క్ ప్రధాని మోదీకి బహుమతిగా ఇచ్చాడు. ఎలన్ మస్క్ టెక్, స్పేస్ సంబంధించిన అంశాలపై ఆసక్తిగా ఉంటాడు.