/rtv/media/media_files/2025/03/30/cKc9wtM4dnz4eJ2ZN6UN.jpg)
Myanmar Earthquake
మయన్మార్‌లో వరుస భూకంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం మరోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదైంది. దీంతో స్థానికులు భయంతో బయటికి పరుగులు తీశారు. వెంటనే స్పందించిన సహాయక బ-ృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ప్రజలను బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇదిలాఉండగా.. శుక్రవారం సంభవించిన భారీ భూకంపం పెను విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో థాయ్‌లాండ్‌లో భూ ప్రకంపనలు సంభవించాయి.
Also Read: ఈడీ సంచలనం...భారీ వ్యభిచార రాకెట్ గుట్టు రట్టు...కోట్లల్లో దందా..
ఈ భూకంపాల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. మరికొన్ని కుప్పకూలిపోయాయి. వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. శుక్రవారం సంభవించిన భారీ భూకంపం వల్ల రోడ్లు, బ్రిడ్జిలు, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని స్థానిక అధికారులు చెబుతున్నారు.
Also Read: జీబ్లీ వాడడాన్ని తగ్గించండి, మా సిబ్బందికి నిద్ర కావాలి: ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మాన్
శుక్రవారం మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి ఇప్పటిదాకా 1600 మందికి పైగా మృతి చెందారు. మరో 3400 మందికి పైగా కనిపించకుండా పోయారు. చాలావరకు భవనాలు కూలిపోవడంతో శిథిలాలు తొలగిస్తున్న కొద్ది మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. శనివారం కూడా మూడుసార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. ఉదయం 11.53 గంటలకు 4.3 తీవ్రతతో, మధ్యాహ్నం 2.30 గంటలకు 3.8, మళ్లీ 20 నిమిషాల వ్యవధిలో 4.7 తీవ్రతతో వరుసగా ప్రకంపనలు వచ్చినట్లు భూకంపన వైజ్ఞానిక కేంద్రాలు వెల్లడించాయి. వరుసగా భూకంపాలు వస్తుండంటంతో మయన్మార్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Also Read: అగ్నిగుండంలా తెలంగాణ.. రాష్ట్రంలో మాడు పగిలే ఎండలు..!
telugu-news | rtv-news | massive earthquake in myanmar