Earthquake : ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం: ఎనిమిది మంది మృతి!

ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలో శుక్రవారం రాత్రి సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని నింపింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి ఆఫ్ఘనిస్తాన్‌లో కనీసం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

New Update
earthquake

ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలో శుక్రవారం రాత్రి సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని నింపింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి ఆఫ్ఘనిస్తాన్‌లో కనీసం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. కాబూల్ సమీపంలో ఒక ఇల్లు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన వారు మరణించగా, ఒక చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. భూ అంతర్భాగంలో 150 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Also Read :  ట్రంప్ ఒక పిచ్చివాడు.. అమెరికా మాజీ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

భారత్‌లో కూడా గట్టిగానే

ఈ భూకంప ప్రభావం భారత్‌లో కూడా గట్టిగానే కనిపించింది. శుక్రవారం రాత్రి 9:50 గంటల సమయంలో ఢిల్లీ-ఎన్సీఆర్ (నొయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్)తో పాటు చండీగఢ్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ వంటి ఉత్తర భారత ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు వచ్చాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లు, ఆఫీసు భవనాల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. కొన్ని సెకన్ల పాటు సాగిన ఈ ప్రకంపనల వల్ల ఫ్యాన్లు, మంచాలు, ఇంట్లోని సామాన్లు కదిలినట్లు నివాసితులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఢిల్లీలో వింత వాతావరణం నెలకొంది. ఒకవైపు అకాల వర్షం కురుస్తుండగానే, మరోవైపు భూకంపం రావడం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్, ఉధంపూర్ వంటి ప్రాంతాల్లో కూడా ప్రజలు భయంతో వణికిపోయారు. అదృష్టవశాత్తూ మన దేశంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదు. అటు పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ నగరాల్లో కూడా ప్రకంపనలు రావడంతో అక్కడి ప్రజలు కూడా ఆందోళన చెందారు. హిందూకుష్ ప్రాంతం భూకంపాలకు అత్యంత ప్రమాదకరమైన జోన్‌ కావడంతో తరుచుగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

Also Read :  భారతీయల ఇంట్లోకి వచ్చి మరీ చంపేస్తాం..  పాక్ రక్షణ మంత్రి బలుపు మాటలు!

Advertisment
తాజా కథనాలు