/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/japan-earth-quake-jpg.webp)
టిబెట్‌లోని షీగాజే డింగ్రి కౌంటీలో జనవరి 7న 9.05 గంటలకు భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. వరుసగా ఆరుసార్లు భూమి కంపించింది. దీని తాకిడికి 126 మంది పౌరులు మరణించారు. మరో 188 మంది గాయపడ్డారు. నేపాల్‌లో ఉన్న ఖబు హిమాలయాల్లో భూకంపం వచ్చినట్లు గుర్తించారు. అక్కడి లబుసేకు ఈశాన్యంగా ఉన్న డింగ్రీ కౌంటీకి చెందిన త్సోగో టౌన్‌షిప్ ను కేంద్రంగా ఇది ఏర్పడిందని చెబుతున్నారు. భూమిలోపల 10 కి.మీ అడుగున ఇది సంభవించింది.
168 గంటల్లో 3, 614 సార్లు..
చైనా–నేపాల్ సరిహద్దులో ఉన్న ప్రాంతం టిబెట్. పర్వతాలు, లోయలతో నిండి ఉంటుంది. ఇక్కడే తీవ్రస్థాయిలో భూమి కంపించింది. దీని ఎఫెక్ట్ చైనా, కొంత భారత్‌ల మీద కూడా పడింది. అయితే తాజాగా మరో విషయం తెలిసింది. జనవరి 7 తర్వాత నుంచి ఇప్పటివరకు భూమి కంపిస్తూనే ఉందని చెబుతోంది నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో భూ ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం 5.2 తీవ్రతతో మళ్ళీ భూకంపం వచ్చింది. మొత్తం 168 గంటల్లో 3, 614 సార్లు భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ చెప్పింది. భూమి 3–5 మధ్య తీవ్రతతో అనునిత్యం కంపిస్తోంది. దీంతో టిబెట్‌లో ప్రజలు వణికిపోతున్నారు. మళ్ళీ ఎక్కడ పెద్ద ప్రమాదం ఎదుర్కోవలసి వస్తుందోనని భయపడుతున్నారు. దీని వలన తాము నిద్రలేని రాత్రులను గడుపుతున్నామని అక్కడి ప్రజలు చెబుతున్నారు. జనవరి 14తేదీ ఒక్కరోజునే 150సార్లు భూమి కంపించింది.
Also Read: Kamala Jobs: స్టీవ్ జాబ్స్ కోరిక తీర్చిన భార్య..కుదుటపడిన ఆమె ఆరోగ్యం
ప్రమాదం ఎక్కడ..
టిబెట్‌లోని షిగాజ్ అనేది షిగాజ్ ప్రావిన్స్‌లోని ఒక ప్రాంతం. భారత సరిహద్దుకు దగ్గరగా ఉన్న దీనిని షిగాస్టే అని కూడా అంటారు. టిబెట్ లోని అత్యంత పవిత్రమైన నగరాలలో ఇద ఒకటి. బౌద్ధమతంలో ప్రముఖ వ్యక్తి అయిన పంచన్ లామా తాలూకా సాంప్రదాయక స్థానం. ఇక్కడే ఎక్కువగా భూ ప్కంపనలు వస్తున్నాయి. ఈ కౌంటీలో 27 గ్రామాలు, సుమారు 60 వేల జనాభా ఉంది. ఈ పీఠభూమి ప్రాంతం శక్తివంతమైన భూకంపాలకు గురయ్యేదిగా గుర్తించారు. ఇది టెక్టోనిక్ యురేషియన్, ఇండియన్ ప్లేట్లు కలిసే చోట ఉంది. ఇవి తరుచుగా తీవ్ర శక్తితో ఢీకొంటున్నాయి. దాని వల్లనే భూకంపాలు సంభవిస్తున్నాయి.
Also Read: క్రిటికల్ కండిషన్‌లో లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు..మరింత వేగంగా గాలులు..