/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/earthquake-4.webp)
పాకిస్తాన్ లోని రావల్పిండి, ఇస్లామాబాద్ లలో భూకంపం సంభవించింది. రాత్రి ప్రజలు నిద్రపోతున్న సమయంలో 10.48 గంటలకు హూమి ఒక్కసారిగా కంపించింది. రావల్పిండికి ఆగ్నేయంగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని చెబుతున్నారు. 17 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని తెలిపారు. దీని ప్రభావం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కూడా పడింది. ఈ కారణంగా అక్కడ కూడా స్వల్పంగా భూమి కంపించింది.
ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదు..
అయితే ఈ భూకంపం తీవ్రత పెద్దగా లేకపోవడం వలన ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదు. రాత్రి ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ళల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇంతకు ముందు గతేడాది చివరలో నవంబర్లో కూడా పాకిస్తాన్లో భూకంపం వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని దక్షాన్ ప్రాంతంలో సంభవించిన భూకంపం ఖైబర్ పఖ్తుంఖ్వా , ఇస్లామాబాద్‌లోని వివిధ నగరాల్లో ప్రకంపనలు సంభవించాయి. ప్రస్తుతం వచ్చిన భూకంపం తీవ్రత 5.1గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే చెబుతోంది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని ఇష్కాషిమ్ నగరానికి పశ్చిమ-నైరుతి దిశలో 37 కి.మీ దూరంలో మరియు 220.7 కి.మీ లోతులో ఉందని తెలిపింది.
Also Read: Second Batch: అమృత్ సర్ చేరుకున్న అక్రమవలసదారుల రెండవ విమానం
అమెరికాలో కూడా..
దాదాపుగా ఇదే సమయానికి అమెరికాలో కూడా భూకంపం సంభవించింది. కాలిఫోర్నియాలో 3.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. రాత్రి 11:44 గంటలకు భూకంపం సంభవించింది. 15.3 కిలోమీటర్ల లోతులో భూమి కంపించింది. కాలిఫోర్నియాలోని మాలిబుకు వాయువ్యంగా 11 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని జియోలాజికల్ సర్వే తెలిపింది. థౌజండ్ ఓక్స్, ఆక్స్‌నార్డ్, సిమి వ్యాలీ మరియు వెంచురాలో ప్రకంపనలు సంభవించాయని, లాస్ ఏంజిల్స్‌లోని కూడా కొన్ని చోట్ల భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.
Also Read: Delhi: అంతా 15 నిమిషాల్లో జరిగిపోయింది...ఢిల్లీ తొక్కిసలాటకు కారణం అదేనా?
Also Read: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట... రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం!