షాకింగ్ ఘటన.. నెదర్లాండ్ యువరాణులపై హత్యాయత్నం.. రెండు గొడ్డళ్లు స్వాధీనం

నెదర్లాండ్స్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు యువరాణులపై హత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

New Update
Dutch Princesses Targeted In Chilling 'Nazi' Murder Plot

Dutch Princesses Targeted In Chilling 'Nazi' Murder Plot

నెదర్లాండ్స్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు యువరాణులపై హత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. డచ్‌ రాజ కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకున్న ఓ వ్యక్తి ఫిబ్రవరిలో యువరాణి కేథరీనా-అమాలియా, ఆమె చెల్లి అలెక్సియాను హత్య చేసేందుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. కానీ భద్రతా కారణాల వల్ల ఈ విషయాన్ని బయటకు చెప్పలేదన్నారు. 

Also Read: చెన్నై ఎయిర్‌పోర్టులో షాకింగ్‌ ఘటన... ఎమర్జెన్సీ డోర్‌ నుంచి దూకేసిన ప్యాసిండర్‌

కొన్ని రోజుల క్రితం నిందితుడిని అరెస్టు చేశామని తెలిపారు. అతడి వద్ద ఉన్న రెండు గొడ్డళ్లు, విద్వేషపూరిత వ్యాఖ్యలతో ఉన్న కాగితాలను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నెదర్లాండ్స్‌ రాజు విల్లె అలెగ్జాండర్‌ 59వ పుట్టినరోజు సందర్భంగా వాళ్ల రాజకుటుంబం ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సమయంలోనే యువరాణులపై జరిగిన హత్యాయత్నం విషయాన్ని అధికారులు వెల్లడించారు. అయితే యువరాణి కేథరీనా-అమాలియా గతంలో కూడా భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొన్నారు. 

Also Read: రేపే ఎన్నికల ఫలితాలు.. 5 రాష్ట్రాల్లో హై అలెర్ట్

యువరాణిపై 2020లో ఓ వ్యక్తి  సోషల్ మీడియాలో అత్యాచారం చేస్తానని, దాడులు చేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. రెండు సంవత్సరాల తర్వాత ఆమ్‌స్టర్‌డామ్‌లోని తాను ఉంటున్న హాస్టల్‌ను ఖాళీ చేసి.. హేగ్‌లోని అత్యంత భద్రత గల రాజభవనానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా పలు అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాలు ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డాయి. దీంతో ఆమె నెదర్లాండ్స్‌ను వదిలి.. ఏడాది పాటు స్పెయిన్‌లో తలదాచుకోవాల్సి వచ్చింది.

Advertisment
తాజా కథనాలు