DUBAI : ఇండియాకు దుబాయ్‌ బిగ్‌షాక్ ..మన విమానాలపై ఆంక్షలు

దుబాయ్‌కి అత్యధిక విమానాలు నడిపే మనదేశానికి బిగ్‌ షాక్‌ ఇచ్చింది. మన విమానాలపై ఆంక్షలు విధించింది. ఇండియాతో పాటు విదేశీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలపై రిస్ట్రిక్షన్స్ పెట్దింది. విదేశీ ఎయిర్‌లైన్స్‌ రోజుకు ఒక్క విమానం మాత్రమే నడపాలని నిబంధన విధించింది.

New Update
FotoJet (28)

Dubai's big shock to India

DUBAI : దుబాయ్‌కి అత్యధిక విమానాలు నడిపే మనదేశానికి ఆ దేశం బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఇండియా విమానాలపై దుబాయ్‌ ఆంక్షలు విధించింది.ఇండియాతో పాటు విదేశీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలపై రిస్ట్రిక్షన్స్ అమలు చేయనుంది.  విదేశీ ఎయిర్‌లైన్స్‌ రోజుకు ఒక్క విమానం మాత్రమే నడపాలని నిబంధన విధించింది. మే 31 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది. నిజానికి ప్రపంచంలో దుబాయ్‌కు అత్యధిక విమానాలు నడిపేది భారతీయ కంపెనీలే కావడం గమనార్హం.

కాగా దుబాయ్‌ నిర్ణయంతో సమ్మర్‌ వెకేషన్‌ కోసం దుబాయ్‌కి వందల విమానాలను ప్లాన్ చేసిన ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌ జెట్‌ సంస్థలకు ఇది కోలుకోలేని దెబ్బే అని చెప్పచ్చు. దుబాయ్ ప్రభుత్వ నిర్ణయంతో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఆదాయానికి తీవ్ర స్థాయిలో గండిపడనుంది. అదే సమయంలోఇండియాకు నడిపే ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్‌పై ఎలాంటి ఆంక్షలు విధించకపోవడం గమనార్హం. అయితే  దుబాయ్‌ నిర్ణయంపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ సీరియస్ అయింది.దుబాయ్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఇండియాకు వచ్చే దుబాయ్ విమానాలపైనా పరిమితి విధించాలని డిమాండ్ చేస్తున్నాయి.

గతేడాది ఇండియా నుంచి దుబాయికి కోటి 20 లక్షల మంది ప్రయాణికులు ఆయా విమానయాన సంస్థల ద్వారా ప్రయాణించారు. ముఖ్యంగా వేసవికాలంలో ఎంజాయ్‌ చేయడానికి భారతీయులు ఎక్కవగా దుబాయ్‌ వెళుతుంటారు. అదే ఉద్దేశంతో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో దుబాయ్‌కి 750 ఫ్లైట్స్ నడపాలని ఎయిర్‌ ఇండియా ప్లాన్ చేసింది. అదే సమయంలో ఇండిగో కూడా 481 విమానాలను నడపాలని ప్లాన్ చేసింది. ఇపుడు దుబాయ్‌ సడెన్‌గా ఆంక్షలు విధించడంతో కేవలం నెలలో 30 - 31 విమానాలను మాత్రమే నడిపే అవకాశం మాత్రమే ఉంటుంది. దీంతో ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా విమానయాన సంస్థలు కూడా తిరిగి చెల్లింపులు చేయాలంటే భారీగా నష్టపోయే అవకాశం ఉంటుంది. దీంతో దుబాయ్‌ నిర్ణయం పై అన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు