/rtv/media/media_files/2026/03/28/drone-attack-targets-salalah-port-in-oman-2026-03-28-16-17-43.jpg)
Drone attack targets Salalah port in Oman, expatriate worker injured
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. శనివారం ఒమన్‌లోని వ్యూహాత్మక సలాహ్ ఓడరేవు లక్ష్యంగా చేసుకొని డ్రోన్ల దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఓడరేవులో పనిచేస్తున్న ఓ విదేశీ కార్మికుడికి గాయాలయ్యాయి. అలాగే ఓ భారీ క్రేన్ పాక్షికంగా ధ్వంసమైంది. సమాచారం మేరకు భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ కంట్రోల్‌లోకి తీసుకున్నాయి. క్షతగాత్రుడైన కార్మికుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఓడరేవు వద్ద జరిగిన నష్టాన్ని ప్రస్తుతం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ వాళ్లే ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు.
Also Read: 28 రోజుల యుద్ధం.. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌కు భారీగా నష్టం.. లెక్కలు ఇవే
ఇరాన్ చేసిన ఈ దాడిని ఒమన్ సర్కార్ తీవ్రంగా ఖండించింది. ఇదో శత్రుపూరిత చర్యగా ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ భద్రతను కాపాడటంతో పాటు నివాసితులు, కార్మికుల రక్షణకు తాము కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. ఇక మార్చి ప్రారంభంలోనే సలాహ్ ఓడరేవులోని ఇంధన నిల్వ ట్యాంకులపై దాడులు జరిగడంతో అక్కడ భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. తాజాగా మళ్లీ అక్కడే దాడులు జరగడంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయనే ఆందోళన నెలకొంది. అయితే ఈ దాడులపై ఇరాన్ ఇంకా స్పందించలేదు.
Also Read: ఇండోనేషియా సంచలన నిర్ణయం ..సోషల్ మీడియా బంద్!
ఇదిలాఉండగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో ఒమన్ తటస్థ వైఖరితో ఉంది. అలాగే అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిగా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ యుద్ధ వాతావరణంలో మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశంపైనే దాడులు జరగడం దుమారం రేపుతోంది. మరోవైపు తమ గడ్డపై శాంతిభద్రతలు కాపాడుకునేందుకు ఒమన్ భద్రతా చర్యలు ప్రారంభించింది.
Follow Us