/rtv/media/media_files/2026/02/24/donald-trump-2026-02-24-06-43-06.jpg)
ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో రిసార్ట్‌లోకి ఆయుధంతో చొరబడబోయిన వ్యక్తిని భద్రతా సిబ్బంది కాల్చి చంపిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తొలిసారి స్పందించారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు ఆయన మాట్లాడుతూ తన భద్రతపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నేను ఇంకెన్నాళ్లు ఉంటానో నాకే తెలీదు. చాలా మంది నన్ను టార్గెట్ చేస్తున్నారు కదా?" అంటూ కాస్త ఆందోళనగా, మరికొంత వ్యంగ్యంగా మాట్లాడారు. 2024 ఎన్నికల ప్రచారంలో కూడా తనపై రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
ట్రంప్ తనదైన స్టైల్లో జోకులు పేలుస్తూనే.. తనను తాను ఒక పవర్‌ఫుల్ లీడర్‌గా చెప్పుకున్నారు. ఈ పిచ్చి షూటర్లంతా ఎప్పుడూ పవర్‌ఫుల్ అధ్యక్షులనే టార్గెట్ చేస్తారు. ఏ ప్రభావం లేని వాళ్ల జోలికి వీళ్లు వెళ్లరు అని అన్నారు. గతంలో హత్యకు గురైన అబ్రహం లింకన్, కెన్నెడీ వంటి గొప్ప నాయకులను ఉదాహరణగా చూపిస్తూ.. నేను కూడా కొన్నాళ్ల పాటు ఒక మామూలు ప్రెసిడెంట్‌లా ఉంటే బాగుంటుందేమో అని నవ్వుతూ వ్యాఖ్యానించారు.
Also Read : పక్కా ప్లాన్.. చిక్కిన డాన్! లవర్ కదలికలే డ్రగ్ లార్డ్ కొంపముంచాయా?
తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో
అసలేం జరిగిందంటే.. నార్త్ కరోలినాకు చెందిన 21 ఏళ్ల ఆస్టిన్ టక్కర్ మార్టిన్ అనే యువకుడు తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో తన కారుతో మార్-ఎ-లాగో ఎస్టేట్ ఉత్తర గేటును బద్దలు కొట్టుకుంటూ లోపలికి వచ్చాడు. అతని దగ్గర ఒక షాట్‌గన్, పెట్రోల్ క్యాన్ ఉండటాన్ని అక్కడి సెక్యూరిటీ గమనించింది. చేతిలో ఉన్నవి కింద పడేయాలని ఆఫీసర్లు గట్టిగా అరిచినా అతను వినలేదు. పైగా పెట్రోల్ క్యాన్ కింద పెట్టి, గన్‌ను అధికారుల వైపు గురిపెట్టాడు. దీంతో చేసేదేమీ లేక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతనిపై కాల్పులు జరపగా, అతను అక్కడికక్కడే చనిపోయాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మార్టిన్ కొన్ని రోజుల క్రితమే ఇంటి నుండి పారిపోయి వచ్చాడు. నార్త్ కరోలినా నుండి ఫ్లోరిడాకు వచ్చే దారిలోనే అతను ఎక్కడో ఈ తుపాకీని సంపాదించాడు. అతని కారులో గన్ బాక్స్‌ను కూడా పోలీసులు గుర్తించారు. అదృష్టవశాత్తూ ఈ గొడవ జరిగినప్పుడు ట్రంప్ అక్కడ లేరు. సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంథోనీ గుగ్లియెల్మి మాట్లాడుతూ, మార్టిన్ కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయినట్లుగా అతని కుటుంబం ఫిర్యాదు చేసిందని అన్నారు. అతను నార్త్ కరోలినా నుండి ఫ్లోరిడాకు ప్రయాణించి మార్గమధ్యలో షాట్‌గన్‌ను కొనుగోలు చేసినట్లుగా అధికారులు విచారణలో తేల్చారు. ఆ తరువాత అతని వాహనం నుండి తుపాకీ పెట్టెను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read : మెక్సికో డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచో మృతి
Follow Us