/rtv/media/media_files/2025/01/12/V5hxacVWj8048K3K3Q3R.jpg)
Donald Trump
ప్రస్తుతం పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాలు ఒకదానిపై ఒకటి కాల్పులు చేపడుతోంది. అయితే ఈ క్రమంలో తమ దేశంపై అమెరికా దాడులకు ప్రతీకారంగా.. గల్ఫ్ దేశాల చమురు రవాణాకు ప్రధాన మార్గమైన హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ప్రపంచ దేశాలకు చమురు సరఫరా ఆగిపోతుందనే భయం మొదలైంది. కానీ ఆ జలమార్గంపై తమదే పైచేయి అని అమెరికా సవాల్ విసిరింది. ఇటీవల వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓ రహస్య మిషన్ నిర్వహించినట్లు తెలిపారు. ఇరాన్‌కు కూడా ఇప్పుడే ఆ విషయం తెలిసి ఉంటుంందన్నారు.
🚨 BREAKING: In a massive move, President Trump reveals the US has TAKEN OUT over 100 MILLION OIL BARRELS through the Strait of Hormuz at his direction
— Eric Daugherty (@EricLDaugh) June 10, 2026
USA HAS TOTAL CONTROL! 🇺🇸
"Last month, I directed our Great U.S. Military to execute a secret mission to support Oil Tankers… pic.twitter.com/7YZSuTKTsQ
కేవలం ఒక్క రాత్రిలోనే 22 పెద్ద చమురు నౌకలను సురక్షితంగా హర్మూజ్ జలసంధి దాటించామని తెలిపారు. ఆ నౌకలు రాడార్లకు చిక్కకుండా ఉండటానికి, చీకట్లో లైట్లు లేకుండా అత్యంత జాగ్రత్తగా ఆపరేషన్ పూర్తి చేశామని ట్రంప్ పేర్కొన్నారు. హర్మూజ్ మార్గంలో వెళ్లే చమురు నౌకలపై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉన్నందున.. అమెరికా నావికాదళం ఒక రక్షణ కవచంలా పనిచేస్తోంది.
అంటే అమెరికా యుద్ధ నౌకలు చమురు రవాణా నౌకల ముందు, వెనుక ఉండి వాటికి రక్షణగా వెళ్తున్నాయి. ట్రంప్ చెప్పిన ఆ 'రహస్య ఆపరేషన్' ఇదే. వాణిజ్య నౌకలను సురక్షితంగా దాటించడం కోసం అమెరికా యుద్ధ నౌకలు చేస్తున్న 'ఎస్కార్ట్' అని చెప్పారు. అయితే గతంలో ఈ హర్మూజ్ జలసంధి గుండా 3 వేలకు పైగా నౌకలు ప్రయాణించేవి. కానీ ఇప్పుడు ఇరాన్-అమెరికా గొడవల వల్ల నౌకల సంఖ్య తగ్గింది.
Follow Us