/rtv/media/media_files/2025/01/20/FS7iXgmotquMHrxjPKzd.jpg)
trump 125333 Photograph: (trump 125333)
అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. 2024 నవంబర్ 5న జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ లీడర్ డొనాల్డ్ ట్రంప్ 312 ఓట్లతో గెలిచిన విషయం తెలిసిందే. 2025 జనవరి 20 (ఈరోజు ) ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారతీయ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10.30లకు బాధ్యతలు స్వీకరించారు. అమెరికా టైం ప్రకారం అది మధ్యాహ్నం. అంతకంటే ముందు ఉపాధ్యాక్షుడిగా జేడీ వ్యాన్స్ ప్రమాణస్వీకారం చేశారు.
Also Read: Trump swearing-in ceremony: ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం విశేషాలేంటో తెలుసా ?
2017లోనే ట్రంప్ మొదటి సారి అధ్యక్షుడిగా గెలిచారు. రెండవ సారి వాషింగ్ డీసీ క్యాపిటల్‌హిల్‌లోని రోటుండా ఇండోర్‌లో పాలనా పగ్గాలు చేపట్టారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ట్రంప్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి అనేక మంది ప్రముఖలు హాజరైయ్యారు. ఎలన్ మస్క్, జుకర్ బర్గ్, సుందర్ పిచాయ్ ప్రమాణస్వీకారానికి హాజరైయ్యారు. ఇండియా తరుపున విదేశాంగ శాఖమంత్రి జై శంకర్ పాల్గొన్నారు. మాజీ అమెరికా అధ్యక్షులు జో బైడెన్, బరాక్ ఒబామా కూడా హాజరైయ్యారు.