/rtv/media/media_files/2026/02/24/donald-trump-2026-02-24-06-43-06.jpg)
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటో (NATO) కూటమి నుండి అమెరికా తప్పుకోవడాన్ని తాను తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ఆయన హింట్ ఇచ్చారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం ముగిసిన తర్వాత కూడా నాటోలో కొనసాగడంపై పునరాలోచన చేస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆ ఆలోచన ఎప్పుడో దాటిపోయిందని ట్రంప్ సమాధానం ఇచ్చారు. అంటే నాటో నుండి బయటకు వచ్చేయడానికే ఆయన మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది.
Also Read : ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. చేతులెత్తేసిన బ్రిటన్, ఇటలీ, స్పెయిన్!
ట్రంప్ తీవ్ర అసహనంతో
ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు(Iran Israel America War) నాటో దేశాలు మద్దతు ఇవ్వకపోవడంపై ట్రంప్ తీవ్ర అసహనంతో ఉన్నారు. ముఖ్యంగా ఇరాన్ దిగ్బంధించిన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించే విషయంలో కూడా మిత్రదేశాలు సహాయం చేయకపోవడం ఆయనకు కోపం తెప్పించింది. నాటో అనేది ఒక 'కాగితపు పులి' అని, ఈ విషయం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు కూడా బాగా తెలుసని ట్రంప్ ఎద్దేవా చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఇదే తరహాలో మాట్లాడుతూ, యుద్ధం తర్వాత నాటోతో సంబంధాలపై ఆలోచించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇదే సమయంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌పై కూడా ట్రంప్ విరుచుకుపడ్డారు. ఇరాన్ యుద్ధంలో అమెరికాకు అండగా నిలవకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. బ్రిటన్ సైనిక శక్తిని తక్కువ చేస్తూ మాట్లాడిన ట్రంప్, ఆ దేశానికి అసలు నావికాదళమే లేదని ఎగతాళి చేశారు. బ్రిటన్ దగ్గర ఉన్న యుద్ధ విమాన వాహక నౌకలు కూడా పనిచేయవని, అవి చాలా పాతబడిపోయాయని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీశాయి. కాగా హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు కలిసి రావాలని చేసిన విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంపై నాటో దేశాలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న ట్రంప్.. వాళ్లు పిరికివాళ్లంటూ ఇటీవల విమర్శించిన విషయం తెలిసిందే.
Also Read : యుద్ధంతో మారిన ప్రపంచ ముఖచిత్రం.. నాటోలో చీలిక, అమెరికాకు మిత్రదేశాల షాక్!
Follow Us