/rtv/media/media_files/2025/03/31/JPOhNB37RX0Qo4fxFJ7n.jpg)
Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్, చైనాపై ప్రతీకా సుంకాలను ఏప్రిల్ 2 నుంచి అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన మరో ప్రకటన చేశారు. ఈ ట్రేడ్ వార్ అనేది కేవలం 10,15 దేశాలకు మాత్రమే పరిమితం కాదని.. ప్రపంచంలో అన్ని దేశాలపై సుంకాలు విధిస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. అమెరికా తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలంటే చర్యలు తీసుకోక తప్పదని స్పష్టం చేశారు.
Also Read: హెచ్‌సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
'' చాలా సంవత్సరాలుగా మేము ప్రపంచ దేశాలతో ఉదారంగా ఉన్నాము. చరిత్రలో ఏ దేశాన్ని దోచుకోని విధంగా ఆ దేశాలు అమెరికాను దోచేసుకున్నాయి. ట్రేడింగ్ విధానంలో కొన్నిసార్లు అమెరికా మిత్రదేశాలు శత్రువుల కంటే దారుణగా ప్రవర్తించాయి. దశాబ్దాలుగా వాళ్లు మాపై విధించిన, వివిధ పేర్లతో దోచుకున్న దానికంటే అమెరికా ఇతర దేశాలపై విధిస్తున్న సుంకాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే మాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న ప్రపంచ దేశాలన్నింటిపై కూడా మా వాణిజ్య టారిఫ్‌లు అమలవుతాయని'' ట్రంప్ అన్నారు.
Also Read: స్టాలిన్ ఉగాది పోస్టు వివాదం.. మేము ద్రవిడులం కాదంటున్న కన్నడ వాసులు..
ఇదిలాఉండగా అమెరికా నుంచి భారత్‌లోకి వస్తున్న ఉత్పత్తులపై ఎంత సుంకం విధిస్తే.. ఇక్కడి నుంచి అమెరికాకు వస్తున్న ఉత్పత్తులపై అదే తరహాలో సమాన సుంకాన్ని ఏప్రిల్ 2 నుంచి అమలు చేస్తామని ఇటీవల ట్రంప్ అన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రకారం.. భారత ఉత్పత్తులపై అమెరికా సగటున 2.2 శాతం సుంకం విధిస్తోంది. అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకం సగటున 12 శాతం ఉంది.
Also Read: అలహాబాద్ ఐఐఐటీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య!
telugu-news | rtv-news | trump | US tariffs | tariff tax | India Tariffs