/rtv/media/media_files/2026/04/30/donald-trump-and-putin-hold-90-minute-phone-call-on-iran-war-2026-04-30-18-29-03.jpg)
Donald Trump And Putin Hold 90 Minute Phone Call On Iran War
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన ఫోన్ సంభాషణ అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అయితే ఈ చర్చల్లో భాగంగా ఇరాన్ సంక్షోభంపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇరాన్‌పై భూతల దాడులు చేయడం ప్రమాదకరమని అన్నారు. ఒకవేళ ఇలాంటి చర్యలకు యత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇదే సమయంలో.. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను తీసుకునేందుకు రష్యా రెడీగా ఉందన్నారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాము కూడా మధ్యవర్తిత్వం వహిస్తామని హామీ ఇచ్చారు.
Also Read: ఇరాన్‌కు సాయం చేస్తున్న పాకిస్థాన్ ?.. అమెరికాకు వెన్నుపోటు..
మరోవైపు చాలాకాలంగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై చర్చల్లో సానుకూల సంకేతాలు వచ్చాయి. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ కోసం ట్రంప్ సూచనలను పుతిన్ స్వాగతించారని రష్యా విదేశీ సలహాదారు యురి ఉషకోవ్ తెలిపారు. దీన్నిబట్టి ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు రష్యా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. ఓవైపు ఇరాన్ అంశంలో హెచ్చరికలు చేస్తూనే ఉక్రెయిన్ విషయంలో కాల్పుల విరమణకు సహకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: అమెరికాకు బిగ్‌షాక్...NPT సమావేశానికి ఉపాధ్యక్షుడిగా ఇరాన్
మరోవైపు పుతిన్‌తో జరిగిన చర్చల వల్ల ట్రంప్ సైతం సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్‌తో యుద్ధాన్ని ఆపేందుకు రష్యా సాయం తీసుకుంటామన్నారు. ఓవైపు ఇరాన్‌ను నియంత్రించడం, మరోవైపు ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలకడంపై ఇరు దేశాల అధినేతలు ఓ అవగాహణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.
Follow Us