/rtv/media/media_files/2025/01/28/pGUkh8zRIxXdG8011pgB.jpg)
deepseek
చైనా (China) కు చెందిన ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ దూకుడు కొనసాగుతోంది. ఆర్ 1 మోడల్ విడుదలతో మొత్తం ఇండస్ట్రీనే షేక్ చేసిన ఈ స్టార్టప్ సంస్థ ...అటు డౌన్‌లోడ్స్ లోనూ దూసుకుపోతుంది. యాపిల్ యాప్ స్టోర్ లో ఇప్పటికే అగ్రస్థానంలోకి చేరిన డీప్‌సీక్ యాప్..గూగుల్ ప్లేస్టోర్ లోనూ నంబర్ 1 స్థానంలో నిలిచింది.
Also Read: TG News: ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు..AI సహాయంతో పంపిణీ!
అమెరికాలోని యాపిల్ యాప్ స్టోర్ లో ప్రస్తుతం ఫ్రీ యాప్స్ జాబితాలో తొలిస్థానంలో ఉండగా..ఓపెన్‌ఏఐ రూపొందించిన చాట్‌జీపీటీ రెండో స్థానంలో ఉంది. ఒక్క అమెరికాలోనే కాదు.దాదాపు 51 దేశాల్లో డీప్‌సీక్ ప్లే స్టోర్ లో అగ్రస్థానంలో ఉందని యాప్‌ఫిగర్స్ సంస్థ చెబుతోంది.
111 దేశాల్లో యాపిల్ యాప్‌స్టోర్ లో , 18 దేశాల్లో గూగుల్ ప్లే స్టోర్ లో టాప్ 10 జాబితాలో కొనసాగుతోందని పేర్కొంది. డీప్‌సీక్ (DeepSeek) మొత్తం డౌన్‌లోడ్లలో 80 శాతం గడిచిన వారంలోనే రావడం గమనార్హం. భారత్ లోనూ కోటికి పైగా డౌన్‌లోడ్లు ఉన్నాయి. మొత్తం డౌన్‌లోడ్లలో చైనా వాటానే దాదాపు 23 శాతంగా ఉంటుందని యాప్ డౌన్‌లోడ్లను విశ్లేషించే సంస్థలు చెబుతున్నాయి.
కానీ ఆ ప్రశ్నలకు మాత్రం..
అతి తక్కువ ఖర్చుతో రూపొందిన డీప్‌సీక్ ఆర్ 1 మోడల్..ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌జీపీటీతో సమానంగా ఫలితాలు ఇస్తుండడంతో ప్రపంచ వ్యాప్త దృష్టిని ఆకర్షించింది. దీని మూలాలు చైనాలో ఉండడమే అనేక సందేహాలు లేవనెత్తుతోంది.పైథాగారస్ కేవలం 30 నిమిషాల్లోనే వివరించిన ఈ ఏఐ మోడల్..చైనాకు సంబంధించిన అంశాల విషయంలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి. 1989 లో తియోనన్మెన్ స్క్వేర్ ఘటన గురించి ఓ నెటిజన్ అడిగినప్పుడు ప్రస్తుతానికి ఇది నా పరిధిలో లేని అంశం. వేరే ఏవైనా ప్రశ్నలు అడగండి అని దాటవేత ధోరణిని ప్రదర్శిస్తోంది. 1989 లో జూన్ 3 అర్ధరాత్రి , జూన్ 4 ఉదయం బీజింగ్ లోని తియానన్మెన్ స్క్వేర్ వద్ద జరిగిన భారీ ప్రదర్శన పై సైన్యం ట్యాంకులతో విరుచుకుపడటంతో వేలమంది మరణించారు.
ఈ ఘటనలో ఎంతమంది మరణించారో ఇప్పటికీ తెలియదు. ఇదొక్కటే కాదు..అరుణాచల్ ప్రదేశ్, బీజింగ్, తైవాన్‌కు సంబంధించిన అంశాల పై ప్రశ్నలకు తన పరిధిలో లేని అంశమని పేర్కొంటోంది.ఆఖరికి భారత్ లోని ఈశాన్య రాష్ట్రాల పేర్లు అడిగినా వేరే ప్రశ్న అడగాలంటూ సమాధానం ఇస్తోంది.
Also Read:BIG BREAKING: మహా కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. యోగీ సర్కార్ సంచలన ప్రకటన
Also Read: Sunita Williams: నడక మర్చిపోయాను, గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా: సునితా విలియమ్స్