/rtv/media/media_files/2025/02/07/mV3JLmRgAM1G9wGo1HZg.jpg)
darein gap
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ..అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు.ఈ క్రమంలో ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద డీపోర్టేషన్ ఆపరేషన్ చేపట్టి,అక్రమ వలసదారుల్లో వణుకు పుట్టిస్తున్నారు.ఉపాధి కోసం కొందరు,శరణార్థులుగా ఇంకొందరు..అగ్రరాజ్యం పై మోజుతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అమెరికాలో అక్రమంగా అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: Manipur: ఏకే 47 తుపాకులుతో ఫుట్ బాల్ మ్యాచ్...వైరల్ అవుతున్న వీడియోలు!
ఇలా వెళ్లేందుకు ఉన్న అక్రమ దారుల్లో ఒకటైన డేరియన్ గ్యాప్ ను దాటడమంటే ప్రాణాలతో చెలగాటమనే చెప్పుకోవాలి. కొలంబియా-పనామాల మధ్య ఉన్న దట్టమైన అడవి ప్రాంతమే డేరియన్ గ్యాప్ . 60 మైళ్లు ఉండే ఈ అభయారణ్యంలో నిటారైన కొండలు, లోయలు ,వేగంగా ప్రవహించే నదులు ఉంటాయి.
Also Read: Prabhas Raja Saab Updates: హ్యాండ్ ఇచ్చిన 'రాజాసాబ్'.. సమ్మర్ రిలీజ్ లేనట్టే..!
విషపూరిత పాములు, క్రూర మృగాలు, ఎల్లప్పుడూ ప్రతికూల వాతావరణం,చిత్తడి నేలలతో కూడిన ఈ ప్రాంతంలో రోడ్డు అనే మాటే ఉండదు...కనపడుదు...వినపడదుకూడా. అందుకే ఈ దుర్భేద్యమైన ప్రాంతంలో మకాం వేసిన నేర ముఠాలు..మాదక ద్రవ్యాల వ్యాపారం, మానవ అక్రమ రవాణాతో పాటు వలసదారుల దోపిడీకి కేంద్రాలుగా మార్చుకున్నాయి.
డేరియన్ గ్యాప్ ను....
అమెరికాలోకి అక్రమంగా తరలించే మానవ అక్రమ రవాణా ముఠాలు డేరియన్ గ్యాప్ ను ప్రధాన మార్గంగా ఎంచుకుంటాయి. దీన్ని దాటేందుకు ఏడు నుంచి 15 రోజుల సమయం పడుతుంది. వీసా తేలికగా వచ్చే పనామా, కోస్టారికా, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల వంటి మధ్య అమెరికాదేశాలకు తొలుత తీసుకెళ్తాయి. మానవ అక్రమ రవాణా ముఠాల సాయంతో అక్కడి నుంచి మెక్సికో,అటు నుంచి అమెరికాలోకి పంపే ప్రయత్నం చేస్తాయి.
అనారోగ్యం,దాడులు కారణంగా మార్గమధ్యంలో అనేకమంది ప్రాణాలు కోల్పోతుంటారు.మహిళలపై డ్రగ్స్ ముఠాల అఘాయిత్యాలు అనేకం..ఎదిరిస్తే ప్రాణాలు పోయినట్లే. కొన్ని దశాబ్దాల క్రితం అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు వేల సంఖ్యలో మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకునే వారు.కానీ ప్రస్తుతం ఏటా లక్షలాది మంది డేరియన్ గ్యాప్ ను దాటుతుననట్లు నివేదికలు చెబుతున్నాయి.
2023లోనే దాదాపు 5.2 లక్షల మంది దీన్ని దాటినట్లు అంచనా. గతేడాది మాత్రం కఠిన నిఘా కారణంగా ఈ సంఖ్య 3 లక్షలకు తగ్గినట్లు తెలుస్తోంది.వెనెజువెలా,హైతీ, ఈక్వెడార్,పాకిస్తాన్,బంగ్లాదేశ్ తో పాటు భారత్ నుంచి అక్రమంగా వలసవెళ్లే వారు ఈ మార్గాన్నిఎంచుకున్నట్లు సమాచారం.
Also Read:Mamatha: కరీంనగర్ మమత కేసు ఛేదించిన పోలీసులు.. ప్రియుడి కుటుంబమే!
Also Read: Crime News: స్కూల్లో మంటలు.. 17 మంది చిన్నారులు సజీవదహనం