/rtv/media/media_files/2025/02/24/FVnNZ2OUN6PaZSBTAQCD.jpg)
Three Years Into Russia-Ukraine War
ఇజ్రాయిల్-హమాస్, ఉక్రెయిన్-రష్యా వార్ కు అంతూ పొంతూ లేదు. ఎంత శాంతి నెలకొల్పాలన్నా సహకరించడం లేదని ట్రంప్ మండిపడుతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ లాంటి యుద్ధోన్మాదులు యుద్ధాన్ని ఆపడంలో చొరవ చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యాతో యుద్ధాన్ని ముగించాలన్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటను వినడం లేదు. దీంతో జెలెన్ స్కీ తీరుపై ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. పైగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ను నియంత కాదని ట్రంప్ పొగుడుతున్నారు. ఉక్రెయిన్ -రష్యాల మధ్య త్వరలోనే శాంతి నెలకొంటుందన్నారు. ట్రంప్ తో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ భేటీ అయ్యారు.
ట్రంప్, జెలెన్ స్కీ లమధ్య వార్..
తెలివిగా వ్యవహరిస్తే రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం వారాల్లోనే ముగిసిపోతుందని, లేకుంటే మూడో ప్రపంచ యుద్ధం రావచ్చన్నారు. యుద్దంలో భాగంగా రష్యా ఆక్రమించిన భూభాగం తిరిగి ఉక్రెయిన్ స్వాధీనం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదని ట్రంప్ అంటున్నారు. రష్యా ఉక్రెయిన్ ల మధ్య శాంతి నెలకొల్పడం అంటే కీవ్ లొంగిపోవడం అని అర్థం కాదు.హామీలు లేని కాల్పుల విరమణ,శాంతిని నెలకొల్పడంలో అమెరికా ప్రమేయం అవసరం అని చెప్పుకొచ్చారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలై నేటికి మూడేళ్లు అయ్యింది. గత మూడేళ్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఇరువైపుల లక్షలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. బిలియన్ల డాలర్ల మేర ఆస్తినష్టం జరిగింది. శివారు గ్రామాలు, పట్టణాలు మరుభూములుగా మారాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చాక ఇరు దేశాల మధ్యా యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్యా చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల రష్యా విదేశాంగ మంత్రి స్థాయి కీలక నేతలతో కూడా ఆయన చర్చలు జరిపారు. చర్చలు మరింత విస్తృత స్థాయిలో జరిగితే మూడేళ్ల యుద్ధానికి ముగింపు పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటిదాకా రష్యా ఆక్రమించిన ప్రాంతం రష్యాకే చెందుతుందని.. ప్రస్తుత వాస్తవాదీన రేఖనే అంగీకరిస్తూ జెలెన్‌స్కీని ఒప్పించాలని ట్రంప్ భావస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.
అంతేకాదు ఇటీవల ట్రంప్.. ఉక్రెయిన్‌కు 500 బిలియన్ డాలర్ల డీల్‌ను కూడా ఆఫర్ చేశారు. తమ మద్దతు కొనసాగాలంటే ఇందుకు బదులుగా 500 బిలియన్ డాలర్లు విలువైన ఖనిజాలను తమకు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఉక్రెయిన్‌లో అరుదైన భూగర్భ ఖనిజాలు, గ్యాస్, చమురు, పోర్టులు, మౌలిక సదుపాయాలతో పాటు ఆ దేశంలో ఉన్న సగభాగం సహజ వనరులపై తమకు ఆధిపత్యం ఇవ్వాలని అమెరికా కోరింది. అయితే వీటిపై జెలెన్ స్కీ అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాపై యుద్ధం చేసేందుకు అమెరికా తమకు 100 బిలియన్ డాలర్లు మాత్రమే సాయం అందించిందని తెలిపారు. ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఆయన ఇలా స్పందించారు. ఈ యుద్ధంలో ఆయుధాల కోసం ఇప్పటిదాకా 320 బిలియన్ డాలర్లు ఖర్చు అయ్యాయని తెలిపారు. ఇందులో 120 బిలియన్ డాలర్లు ప్రజల నుంచే సేకరించామని, మరో 200 బిలియన్ డాలర్లు ఐరోపా సమాఖ్య, అమెరికా ఇచ్చినట్లు జెలెన్‌స్కీ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.
మరోవైపు జెలన్ స్కీ ఎన్నికలు లేని నియంత అని ట్రంప్ విరుచుకుపడ్డారు. జెలెన్ స్కీ పదవీ కాలం ముగిసినా ఆయన ఇంకా పదవిలోనే ఉన్నారని...యుద్ధ సమయంలో ఎన్నికలు అవసరం లేనందున ఉండిపోయారని అన్నారు. ఎన్నికలు లేని నియంతగా ప్రవర్తిస్తున్నారని ఘాటూ విమర్శలు చేశారు. అంతటితో ఆగకుండా కాస్త భూమి ఇస్తే పోయేదానికి అనసవరంగా యుద్ధం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఇప్పుడు ఎక్కువ ల్యాండ్ తో సహా వేలల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆరోపించారు ట్రంప్. యుద్ధానిక ముందే ఉక్రెయిన్ , రష్యాతో ఒప్పందం చేసుకుంటే మంచిది కదా...జెలెన్ స్కీ ఆ పని ఎందుకు చేయలేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఉక్రెయిన్ మాస్కోపై ఎప్పటికీ గెలవలేదు. ఇలా ఇద్దరి మధ్యనా గత కాలంగా వార్ నడుస్తూనే ఉంది. ఇది ఎక్కడకు దారి తీస్తుందో..అసలు రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగుతుందా లేదా అనే సందేహాలు ముదురుతున్నాయి.