/rtv/media/media_files/2026/05/27/fotojet-3-2026-05-27-11-36-56.jpg)
చైనా ఇప్పుడు ఏఐ రంగంలో కఠిన రూల్స్ తీసుకొస్తోంది. ఇప్పటి వరకు టెక్నాలజీ అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టిన చైనా.. ఇప్పుడు ఆ టెక్నాలజీని రూపొందిస్తున్న నిపుణులపై కూడా దృష్టి పెట్టింది. ముఖ్యంగా టాప్ ఏఐ టాలెంట్ ఉన్నవారు విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు అక్కడ ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొస్తోంది. అలీబాబా, డీప్‌సీక్ వంటి పెద్ద ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఏఐ నిపుణుల విదేశీ ప్రయాణాలపై కఠిన ఆంక్షలు చైనా అమలు చేస్తోంది. అయితే ఈ ఆంక్షలు కేవలం పెద్ద పదవుల్లో ఉన్నవారికి మాత్రమే కాదు.. కీలక ప్రాజెక్టులలో పనిచేస్తున్నా వారికి కూడా వర్తిస్తుంది. అంటే దేశానికి కావాల్సిన టెక్నాలజీపై ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్లందరూ కూడా ఈ రూల్స్ పాటించాలని చైనా ప్రభుత్వం తెలిపింది.
ఇది కూడా చూడండి: Prabhas Spirit: ప్రభాస్ తో తృప్తి డిమ్రి యాక్షన్ షురూ.. ‘స్పిరిట్’ షూటింగ్ ‘స్పెషల్’ అప్డేట్!
China is expanding overseas travel restrictions to top AI talent at private firms, including people tied to Alibaba and DeepSeek, per Bloomberg. The curbs require certain AI founders, researchers, and executives to get approval before traveling abroad. pic.twitter.com/uSkTGZZjFQ
— Wall St Engine (@wallstengine) May 26, 2026
కొత్త రూల్స్ అమలు..
ఇకపై ఈ రంగానికి చెందిన ఉద్యోగులు విదేశాలకు వెళ్లాలనుకుంటే ముందుగానే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీల వరకు కూడా ఇవే రూల్స్ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరు వారి ట్రావెల్ గురించి కేవలం ఇన్ఫ్‌ర్మేషన్ మాత్రమే ఇచ్చేవారు. కానీ ఇకపై ప్రభుత్వం ఆ ప్రయాణాలను నేరుగా నియంత్రిస్తోంది. అయితే చైనా ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం.. జాతీయ భద్రత. ఎందుకంటే ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ కీలకంగా మారింది. ఇందులో ఉన్న సమాచారం, పరిజ్ఞానం ఇతర దేశాలకు చేరితే దానివల్ల చైనాకు నష్టం కలగనుంది. ముఖ్యంగా అమెరికాతో ఉన్న టెక్నాలజీ పోటీ కారణంగా చైనా ఏఐ విషయంలో ఈ రూల్స్ తీసుకొన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Tamil Nadu : తమిళనాడులో STF చీఫ్ గా 'లేడీ సింగం'భవానీశ్వరి? ఇంతకు ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?
ఇలాంటి రూల్స్ తీసుకురావడం చైనాకు ఇదేం కొత్త కాదు. గతంలో అణు శాస్త్రవేత్తలు, ప్రముఖ పరిశోధకులపై కూడా ఇలాంటి ఆంక్షలు విధించింది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల పాస్‌పోర్ట్‌లను కూడా అధికారులు తమ దగ్గరే ఉంచుకునేవారు. ఇప్పుడు అదే రూల్ ఏఐ రంగంలో కూడా కనిపిస్తోంది. అయితే ఇటీవల మానస్ ఏఐ అనే స్టార్టప్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆ సంస్థను విదేశీ కంపెనీ కొనుగోలు చేయాలని ప్రయత్నించగా.. చైనా ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ సంస్థ వ్యవస్థాపకులు దేశం విడిచి వెళ్లకుండా కూడా ఆంక్షలు విధించినట్లు సమాచారం.
ఇది కూడా చూడండి: BIG BREAKING : నాగేశ్వర్ కోసం ఏపీ పోలీసులు.. పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన!
Follow Us