/rtv/media/media_files/2025/02/26/Scls3UVG1CucWeEXXYvR.jpg)
China company new rule Photograph: (China company new rule)
చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన షుంటియన్ కెమికల్ గ్రూప్ అనే కంపెనీ కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. సెప్టెంబర్ నెల లోపల పెళ్లి చేసుకోని ఉద్యోగులను పూర్తిగా తొలగిస్తామని ప్రకటించింది. 28 నుంచి 58 సంవత్సరాల వయస్సు ఉన్న అవివాహితులు, విడాకులు తీసుకున్న వారు వెంటనే పెళ్లి చేసుకోవాలని తెలిపింది.
ఇది కూడా చూడండి: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!
China company makes U-turn after issuing marriage deadline to single and divorced employees.
— True Taleblogs (@taleblogs47022) February 25, 2025
A Chinese company that gave a deadline to all single and divorced staff to marry before September or be fired has made a u-turn after facing backlash. pic.twitter.com/TKvoUIxVEt
ఇది కూడా చూడండి: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగంలో నుంచి..
ఒకవేళ చేసుకోకపోతే ఉద్యోగంలో నుంచి తీసేస్తామని తెలిపింది. పెళ్లి కాని వారంతా మార్చి నెలకి ఒక లెటర్ సమర్పించాలి. జూన్ నెలకి కూడా ఉద్యోగులు ఎవరెవరు పెళ్లి చేసుకున్నారని తనిఖీలు చేసి.. వారిని సెప్టెంబర్ నెలకి ఉద్యోగంలో నుంచి తీసేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. ఈ విషయంలో సోషల్ మీడియాలో వైరల్ కాగా అధికారుల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. అయినా కూడా కంపెనీ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఇప్పటి వరకు అయితే పెళ్లి కారణంతో ఉద్యోగలను తీసేయలేదని తెలిపింది.
ఇది కూడా చూడండి: Aadi Pinishetty: భార్యతో ఆది పినిశెట్టి విడాకులు.. అసలు విషయం బయటపెట్టిన హీరో
చైనాలో సాంప్రదాయ విలువల బట్టి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. పెళ్లి చేసుకోకపోవడం అనైతికమని దానికి అందరూ సహకరించాలని తెలిపింది. అయితే ఈ విషయం తీవ్ర వివాదస్పదం కావడంతో పలువురు మండిపడ్డారు. చైనాలో ఉద్యోగ చట్టం ప్రకారం ఉద్యోగానికి, పెళ్లికి సంబంధం లేదని తెలిపారు. అయితే చైనా జనాభ తగ్గిపోవడం వల్లే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.