/rtv/media/media_files/2026/04/25/china-2026-04-25-07-31-13.jpg)
China acquired capacity to build 50 nuclear power reactors simultaneously
చైనా కీలక ప్రకటన చేసింది. ఏకకాలంలో 50 అణు రియాక్టర్లను నిర్మించగల సామర్థ్యం తమకు ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ముడి చమురు లాంటి శిలాజ ఇంధాలపై ఆధారపడటాన్ని చైనా తగ్గించుకుంది. ఇంధన భద్రతను పెంచుకోవడమే లక్ష్యంగా అణు విద్యుత్ రంగాన్ని విస్తరిస్తోంది. ప్రస్తుతం చూసుకుంటే చైనాలో 60 వాణిజ్య అణు రియాక్టర్లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. మరో 36 రియాక్టర్లు నిర్మాణ దశలో ఉన్నాయి.
Also Read: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు క్యాన్సర్.. క్లారిటీ
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నిర్మిస్తున్న అణు విద్యుత్ కేంద్రాల్లో సగం వాటా చైనాలోనే ఉంది. ఇవే కాక.. మరో 16 కొత్త రియాక్టర్ల నిర్మాణానికి కూడా పర్మిషన్లు వచ్చాయి. అణు విద్యుత్ ఉత్పత్తిలో తాము అగ్రస్థానానికి చేరుకున్నట్లు 'చైనా అణు ఇంధన సంఘం'(CNEA) నివేదిక వెల్లడించింది. అయితే చైనాలో ప్రస్తుత అణుశక్తి సామర్థ్యం ఇప్పటికే 125 మిలియన్ కిలోవాట్ల మార్కను క్రాస్ చేసింది.
Also Read: నికోలస్ మదురో నిర్బంధంపై పందెం.. రూ.3 కోట్లు గెలుచున్న సైనికుడు
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొనే అణు సామర్థ్యాన్ని భారీగా పెంచాలని చైనా భావిస్తోంది. 2040 నాటికి తమ అణు విద్యుత్ సామర్థ్యాన్ని 200 గిగా వాట్లకు చేర్చడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్లు CNEA ఛైర్మన్ యాంగ్ చాంగ్లీ స్పష్టం చేశారు.
చైనా కచ్చితంగా 50 రియాక్టర్లు నిర్మించగలమని చెప్పేందుకు ప్రధాన కారణం వాళ్లు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 'హులాంగ్ వన్' అనే థర్డ్ జనరేషన్ రియాక్టర్ టెక్నాలజీ. గతంలో చైనా రష్యా, ఫ్రాన్స్ దేశాలు ఈ సాంకేతికతపై ఆధారపడేవి. కానీ ఇప్పుడు సొంత టెక్నాలజీ ఉండటం వల్ల నిర్మాణ ఖర్చు తగ్గనుంది. దీంతో పాకిస్థాన్ లాంటి ఇతర దేశాలకు కూడా అణు రియాక్టర్లను ఎగుమతి చేసే స్థాయికి చైనా చేరుకుంది.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడితే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని చైనాకు ఓ భయం ఉంది. అందుకే "ఎనర్జీ ఇండిపెండెన్స్" కోసం అణుశక్తిని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. 2060 నాటికి చైనా 'నెట్ జీరో' (కార్బన్ రహిత దేశం) కావాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ క్రమంలోనే బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలను మూసివేస్తోంది. వీటి స్థానంలోనే అణు రియాక్టర్ల నిర్మాణం చేపట్టింది. అణుశక్తి వల్ల గాలి కాలుష్యం అనేదే ఉండదు. అందుకే బీజింగ్ లాంటి నగరాల్లో కాలుష్య నియంత్రణకు చైనా తీసుకున్న ఈ నిర్ణయం దోహదపడనుంది. ప్రస్తుతం చైనా 60 వాణిజ్య అణు రియాక్టర్లను నిర్వహిస్తుండగా.. మరో 36 నిర్మాణంలో ఉన్నాయి. అయితే తాజాగా తాము ఏకకాలంలో 50 అణు రియాక్టర్లు నిర్మించగలమని చైనా ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Follow Us