/rtv/media/media_files/2025/03/29/mDn7S3jKn27jPEEOeCox.jpg)
Sheik Hasina
Sheik Hasina: బంగ్లాదేశ్(Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా సీఐడీ(CID) ఆమెపై కేసు నమోదు చేసింది. ఆ దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న మధ్యంతర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రపన్నారనే ఆరోపణలతో ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. షేక్ హసీనాతో పాటు మరో 72 మందిపై కూడా సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఈ కేసుపై విచారణ ప్రారంభించాలని సీఐడీని ఆదేశించింది.
Also Read: మరో మయన్మార్ కానున్న భారత్.. త్వరలో ఇండియాలో విధ్వంసం!
ఇక వివరాల్లోకి వెళ్తే..
ఇటీవల బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ అంశంపై షేక్ హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె దేశం విడిచి పారిపోయారు. దీంతో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం బంగ్లేదేశ్‌కు ఆయనే ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే డిసెంబర్ 19, 2024న మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలో ఓ ఆన్‌లైన్ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. జాయ్ బంగ్లా బ్రిగేడ్ అనే పేరుతో షేక్ హసీనాతో పాటు ఇతరులు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న యూనస్ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్లీ షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఎలా పునరుద్ధరించాలనే దానిపై చర్చలు జరిపారు. ఈ సమాచారం సీఐడీ దృష్టికి వెళ్లడంతో అధికారులు షేక్ హసీనాతో పాటు మరో 72 మందిపై కేసు నమోదు చేశారు.
Also Read: అమెరికాలోని విదేశీ విద్యార్థులకు షాక్.. బహిష్కరిస్తున్నమంటూ మెయిల్స్!
అయితే ఈ మీటింగ్ పాల్గొన్నవారి వాయిస్ రికార్డింగ్‌లు కూడా బయటపడ్డాయి. అందులో షేక్ హసీనా, ఇతర నాయకులు, కార్యకర్తల మధ్య చర్చలు జరిగాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న తాత్కాలిక ప్రభుత్వంలో ప్రశాంతత లేకుండా చేయాలని ఇందులో పాల్గొన్నవాళ్లు ప్రతిజ్ఞ చేసినట్లు బంగ్లాదేశ్ స్థానిక మీడియా వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం బంగ్లాదేశ్‌లో దుమారం రేపుతోంది. ఇదిలాఉండగా గతేడాది ఆగస్ట్ 5న బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ అంశంపై అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయింది. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్ విడిచి భారత్‌కు పారిపోయారు. ప్రస్తుతం ఆమె ఇండియాలోనే ఉంటున్నారు.
Also Read: మయన్మార్, థాయ్ లాండ్ లలో 700 దాటిన మృతుల సంఖ్య
Also Read: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
sheik-hasina | bangladesh | telugu-news | cid