/rtv/media/media_files/2026/05/10/car-bomb-attack-at-checkpoint-kills-15-in-pakistan-2026-05-10-15-46-42.jpg)
Car bomb attack at checkpoint kills 15 in Pakistan
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. బన్ను ప్రాంతంలోని ఫతే ఖేల్ దగ్గర ఉన్న ఓ పోలీస్ చెక్‌పోస్ట్‌ను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో 12 మంది పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఈ దాడికి ఇప్పటిదాకా ఏ ఉగ్ర సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. ఓ ఉగ్రవాది పేలుడు పదార్థాలతో నిండిన కారుతో వేగంగా వచ్చి పోలీస్ చెక్‌పోస్టును ఢీకొన్నాడు. ఈ బాంబు పేలిన ధాటికి చెక్‌పోస్ట్ భవనం ధ్వంసమయ్యింది.
Also Read: విజయ్ మంత్రివర్గంలో ఒకే ఒక మహిళా మంత్రి...ఆమె బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ ...
ఈ క్రమంలోనే ఉగ్రవాదులు ఆయుధాలతో లోపలికి చొరబడి విచక్షణారహితంగా కాల్పులుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి ఆచూకీ కూడా తెలియకుండా పోయింది. ఈ దాడిలో ఉగ్రవాదులు ఆధునిక సాంకేతికతను కూడా వినియోగించారు. భద్రతా దళాల కదలికలు కనిపెట్టేందుకు, దాడిని సమర్థవంతంగా అలు చేసేందుకు క్వాడ్‌కాప్టర్లు, భారీ ఆయుధాలు వాడినట్లు పాక్ భద్రతా దళాలు గుర్తించాయి.
15 police personnel were martyred and 3 injured in a deadly suicide attack on the Fateh Khel police post Bannu, Terrorists rammed an explosives-laden vehicle into the post before launching a coordinated assault with heavy gunfire from multiple directions, pic.twitter.com/DWf3zJeM52
— Umar Wazir (@umar_wazir) May 10, 2026
Also Read: అమెరికాలో దారుణం.. రన్‌వేపై పాదాచారిని ఢీకొట్టిన విమానం
కాల్పుల తర్వాత ఉగ్రవాదులు కొందరు సిబ్బందిని కూడా తమ వెంట బందీలుగా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ సైన్యం అప్రమత్తమైంది. పోలీసులు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలాఉండగా గతంలో కూడా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉగ్రదాడులు జరిగాయి. తాజాగా మళ్లీ జరగడం కలకలం రేపుతోంది. ఈ ఉగ్రదాడి ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.
Follow Us