Canada : కెనడా వీసా రూల్స్ కట్..  ఇమ్మిగ్రేషన్ రూల్స్‌లో భారీ మార్పులు

కెనడా ప్రభుత్వం తన ఇమ్మిగ్రేషన్ విధానంలో కీలక మార్పులు చేపట్టింది. దేశానికి వచ్చే వలసదారుల సంఖ్యను తగ్గించుకుంటూనే, మరోవైపు అత్యవసర రంగాల్లో నైపుణ్యం ఉన్నవారిని ఆహ్వానించడానికి సరికొత్త ప్రయారిటీ కేటగిరీలను ప్రవేశపెట్టింది.

New Update
canada

కెనడా ప్రభుత్వం తన ఇమ్మిగ్రేషన్ విధానంలో కీలక మార్పులు(immigration rules) చేపట్టింది. దేశానికి వచ్చే వలసదారుల సంఖ్యను తగ్గించుకుంటూనే, మరోవైపు అత్యవసర రంగాల్లో నైపుణ్యం ఉన్నవారిని ఆహ్వానించడానికి సరికొత్త ప్రయారిటీ కేటగిరీలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా డాక్టర్లు, పరిశోధకులు, పైలట్లు,రక్షణ రంగ నిపుణులకు కెనడా ద్వారాలు త్వరగా తెరుచుకోనున్నాయి. బుధవారం ఫెడరల్ ప్రభుత్వం(federal government shutdown) ప్రవేశపెట్టిన ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ విధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ప్రస్తుత ఆర్థిక వ్యవస్థకు తక్షణ ఊపునిచ్చే నిపుణులనే లక్ష్యంగా చేసుకుని ఈ మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తాజా నిబంధనల ప్రకారం.. హెల్త్‌కేర్, ఏవియేషన్, డిఫెన్స్ రంగాల్లో ఉన్నవారికి ఫాస్ట్ ట్రాక్ వీసాలు లభిస్తాయి. ఇందులో విదేశాల్లో శిక్షణ పొంది కెనడాలో అనుభవం ఉన్న వైద్యులు, సీనియర్ మేనేజర్లు, విమాన మెకానిక్స్‌తో పాటు అడ్వాన్స్‌డ్ రీసెర్చర్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అయితే, వీటన్నింటికంటే ముఖ్యమైన మార్పు ఏంటంటే.. కెనడియన్ సాయుధ దళాల్లో చేరడానికి సిద్ధంగా ఉన్న విదేశీ సైనిక దరఖాస్తుదారులకు, మిలిటరీ డాక్టర్లకు, పైలట్లకు కూడా ఈ ప్రోగ్రామ్ కింద పెద్దపీట వేయబోతున్నారు.

Also Read :  భారీగా పెరిగిన కీరా దోస ధరలు.. కిలో రూ.358 పెట్టి కొంటున్న రష్యన్లు

జీడీపీలో 5 శాతానికి పెంచాలని

కెనడా(canada) ప్రధాని మార్క్ కార్నీ తన రక్షణ వ్యూహంలో భాగంగా అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించి, స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2035 నాటికి తన రక్షణ వ్యయాన్ని జీడీపీలో 5 శాతానికి పెంచాలని నిర్ణయించిన కెనడా, అందుకు కావాల్సిన నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఈ వలసల ద్వారా భర్తీ చేసుకోవాలని చూస్తోంది. ఒకవైపు దేశంలో గృహ నిర్మాణ రంగంపై ఒత్తిడి తగ్గించేందుకు మొత్తం వలసదారుల సంఖ్యను తగ్గిస్తూనే, మరోవైపు అత్యంత అవసరమైన రంగాల్లో నిపుణులను మాత్రం వదులుకోకూడదని కెనడా ప్రభుత్వం ఈ బ్యాలెన్సింగ్ నిర్ణయం తీసుకుంది. ఫ్రెంచ్ భాష తెలిసిన వారు, హెల్త్‌కేర్ వర్కర్లకు గతంలో ఉన్న ప్రాధాన్యత కూడా యధావిధిగా కొనసాగుతుంది.

మొత్తం వలసదారుల సంఖ్యను కెనడా గణనీయంగా తగ్గిస్తోంది. అంటే సాధారణ ఉద్యోగాల కోసం వెళ్లేవారికి పోటీ విపరీతంగా పెరగనుంది. గతంలో స్టూడెంట్ వీసా ద్వారా వెళ్లి సెటిల్ అవ్వడం సులభంగా ఉండేది. కానీ ఇప్పుడు స్టూడెంట్ పర్మిట్లపై ఆంక్షలు పెరగడం, పీఆర్ కోసం స్కోరు పెరగడం వల్ల విద్యార్థులకు ఇది కొంత ఇబ్బందికర పరిణామమే అని చెప్పవచ్చు.  డాక్టర్, సైంటిస్ట్ లేదా డిఫెన్స్ టెక్ నిపుణులు అయితే ఇది వారికి గోల్డెన్ ఛాన్స్. కేవలం సాధారణ ఉద్యోగం కోసం వెళ్లాలనుకునే వారికి మాత్రం ఇది ఒక గడ్డుకాలమనే చెప్పాలి.

Also Read :  పాకిస్థాన్‌కు ఎండాకాలంలో 'జల'గండం.. రావి నదిపై గుప్పిట బిగించిన భారత్

Advertisment
తాజా కథనాలు