Brezil Strome: సూపర్ సెల్ తుఫాన్‌తో బ్రెజిల్‌ అతలాకుతలం.. వీడియో వైరల్!

బ్రెజిల్‌ను సూపర్ సెల్ తుఫాన్ భయపెడుతోంది. సొరోకాబోలో ఉరుములు, బలమైన గాలులు, మెరుపులతో కూడిన తుఫాన్ కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జనం ఇళ్లల్లో దాక్కున్న వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. 

New Update
supercell hits brazil

Brazil supercell hits

Brezil Strome: బ్రెజిల్‌లోని సావో పాలోలోని సొరోకాబోలో భారీ తుఫాన్ భయపెట్టింది. హాలీవుడ్ సినిమాల్లో గ్రాఫిక్స్ తరహాలో ఆకాశంలో అత్యంత భయంకరంగా కనిపించింది. దానిని చూసిన స్థానికులు పరుగులు పెట్టారు. ఇళ్లలోకి దూరి ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ దాక్కున్నారు. బలమైన మేఘాలతో సూపర్‌ సెల్‌గా కనిపించింది. సుడిగాలులు తిరుగుతూ.. బలమైన గాలులు వీస్తూ ముందుకు కదిలింది. 
ప్రస్తుతం బ్రెజిల్‌లోని ఈ తుఫాన్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలా మంది జనం తుఫాన్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇది విచిత్రంగా, ఎంతో భయంకరంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. దానిని చూస్తుంటేనే ప్రాణాలు పోతున్నాయంటున్నారు.

సోరోకాబాలో అకస్మాత్తుగా భారీ వర్షం.. 

బ్రెజిల్ ఆకాశంలో కనిపించిన ఈ దృశ్యంపై శాస్త్రవేత్తలు కూడా స్పందించారు. సుడుగాలులు సాధారంగా వస్తుంటాయని.. కానీ ఉరుములు, మెరుపులతో కూడిన సుడుగాలులు రావడంతో చాలా అరుదని వ్యాఖ్యానించారు. ఇవి చాలా డేంజర్ అని.. ఇలా సుడులు తిరుగుతూ వెళ్తున్న మెసో సైక్లోన్ చాలా దూరం వెళ్తుందన్నారు. ఆగ్నేయ బ్రెజిల్‌లో ఇటువంటి సూపర్‌సెల్ తుఫానులు చాలా అరుదుగా వస్తుంటాయన్నారు. ఈ భారీ సుడిగాలుల వల్ల సోరోకాబాలో అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. 

ఇది కూడా చదవండి: Crime: మేడ్చల్ యువతి హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు..

గాలిలో సుడిగుండాలు సాధారణంగా ఏర్పడుతుంటాయి. అవి ఏర్పడటానికి ప్రధాన కారణం.. ఆ ప్రాంతంలో గాలిలో సంక్షోభం ఏర్పడటం. పైగా గాలిలో అస్థిరత ఉండటం. గాలికి అధిక ఉష్ణోగ్రత అంటే.. గాలిలోని అణువులు ఎక్కువ శక్తి కలిగి ఉంటాయి. తక్కువ ఉష్ణోగ్రత అంటే గాలిలోని అణువులు తక్కువ శక్తి కలిగి ఉండటం. ఇలా ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఉన్నప్పుడు ఎక్కువ శక్తి ప్రాంతం నుంచి తక్కువ శక్తి ప్రాంతానికి గాలి కదులుతుంది. ఈ గాలి కదలికలు మితిమీరితే గాలిలో సుడిగుండాలు ఏర్పాడుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

Advertisment
Advertisment
Advertisment