/rtv/media/media_files/2025/02/07/kMdBhi4ng5fm1i6UdyTW.jpg)
Brazil Sao Paulo plane crashes on busy street At least 2 killed
Brazil Plane Crash
బ్రెజిల్ (Brazil) లోని సావో పాలో నగరంలో భారీ విమాన ప్రమాదం (Plane Crash) జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కింగ్ ఎయిర్ F90 లైట్ ఎయిర్‌క్రాఫ్ట్ విమానం.. పశ్చిమ భాగంలోని పోర్టో అలెగ్రేకు వెళుతుండగా మార్క్వెస్ డి సావో విసెంటే అనే ప్రాంతంలో కూలిపోయింది. విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా నడిరోడ్డుపై పడి బస్సును ఢీకొట్టింది.
ఇది కూడా చూడండి: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులపై కేసు.. అసత్య ప్రచారం చేసినందుకేనా?
విమానంలో మృతదేహాలు
దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. అనంతరం కాలిపోయిన విమానంలో రెండు మృతదేహాలను గుర్తించారు. అలాగే ఈ ప్రమాదంలో బస్సు లోపల ఉన్న ఒక మహిళ గాయపడింది. ఆ సమయంలో రోడ్డు దాటుతున్న మోటార్‌సైకిలిస్ట్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరికీ అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
❗️✈️🇧🇷 - Videos Capture Exact Moment of King Air Crash in São Paulo, Brazil
— 🔥🗞The Informant (@theinformant_x) February 7, 2025
Disturbing footage from São Paulo today shows the tragic moment a small King Air aircraft struggled to gain altitude post-takeoff before crashing. In the first video, the plane can be seen battling to… pic.twitter.com/HHPSAcnNSA
అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందో అన్న విషయాన్ని స్థానికులు మీడియాకు చెబుతున్నారు. విమానం బస్సులోకి దూసుకెళ్లినప్పుడు పేలుడు శబ్దం వినిపించిందని అన్నారు. ఉదయం ఆకాశంలోకి పెద్ద ఎత్తున నల్లటి పొగలు ఎగసిపడుతున్నట్లు చూశామన్నారు.
ఇది కూడా చూడండి: Telangana: సుప్రీం కోర్టు సంచలన తీర్పు..మొదటి పెళ్లి రద్దుకాకపోయినప్పటికీ కూడా రెండో భర్త భరణం ఇవ్వాల్సిందే
ఇక ఈ ప్రమాదంపై అగ్నిమాపక శాఖ స్పందించింది. ప్రమాదం జరిగిన వెంటనే ఏడు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి అని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. శాంటా బ్రిగిడా బస్సు కంపెనీకి చెందిన 732 బస్సులో ప్రయాణికులు లేరని అగ్నిమాపక శాఖ తెలిపింది.
ఇది కూడా చూడండి:America: నరకాన్ని దాటుకుంటూ అక్రమంగా అమెరికాకు...డేరియన్ గ్యాప్ మార్గం అంటే ఏంటి..దీనిని నుంచి వెళ్తే అగ్రరాజ్యాన్ని చేరుకోవచ్చా?