/rtv/media/media_files/amFxMEEREhaCqcTNWoku.jpg)
Morocco ship incident
Morocco: పశ్చిమ ఆఫ్రికా మౌరిటానియా నుంచి 86 మంది వలసదారులతో బయలుదేరిన పడవ ఘోర ప్రమాదానికి గురైంది. మొరాకో (Morocco) లోని దఖ్లా నౌకాశ్రయం సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 50 మంది నీటిలో గల్లంతు కాగా.. 36 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 44 మంది పాక్ పౌరులు ఉన్నట్లుగా సమాచారం. అయితే పడవలో ప్రయాణించిన 86 మంది వలసదారుల్లో పాకిస్థాన్ (Pakistan) కు చెందినవారే 66 మంది కంటే ఎక్కువ ఉన్నారు. వివరాల ప్రకారం, పడవలో 50పైగా మందిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలిసింది. అందులో పాకిస్తాన్ జాతీయులు కూడా ఉన్నారు. వెస్ట్రన్ ఆఫ్రికా ద్వారా స్పెయిన్ కెనరీ ద్వీపాలకు వారిని అక్రమంగా తీసుకెళ్తుండగా పడవ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
Also Read : నాంపల్లి నుమాయిష్ లో తప్పిన పెను ప్రమాదం.. తలకిందులుగా ఇరుక్కుపోయిన జనం
A boat carrying 80 migrants attempting to reach #Spain capsized near #Morocco. Over 40 #Pakistanis who were in the boat were reportedly among the dead. According to the migrant rights group Walking Borders, at least 50 migrants may have drowned in the incident. The… pic.twitter.com/0dF0eheBCD
— Upendrra Rai (@UpendrraRai) January 17, 2025
స్పందించిన పాక్ ప్రధాని
ఈ ఘటన పై స్పందించిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. మానవ అక్రమ రవాణా చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అలాగే ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. మొరాకో తీరంలో పడవ బోల్తా పడింది. ఇందులో అనేక మంది పాకిస్థానీయులతో సహా 80 మందికి పైగా ప్రయాణికులను ప్రమాదానికి గురవడం మొత్తం దేశాన్ని షాక్‌కి గురి చేసింది అని PM షరీఫ్ ఎక్స్‌లో రాశారు. అలాగే ఈ ప్రమాదంలో తప్పిపోయిన వారిని గుర్తించడానికి, ప్రాణాలతో బయటపడిన వారిని రక్షించడానికి, ఈ ప్రాణాలు కోల్పోయిన వారి అవశేషాలను తిరిగి తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించామని తెలిపారు. ఈ ప్రమాదకరమైన ఉచ్చులోకి అమాయక పౌరులను ఆకర్షించే పాకిస్తాన్‌లోని మానవ అక్రమ రవాణాదారులు ఏజెంట్లపై కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Also Read : కాల్పుల విరమణ తర్వాత కూడా ఇంకా దాడులు ..100 మంది మృతి!
Also Read : Breaking: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో డీమార్ట్, రిలయన్స్ ట్రెండ్స్!