Tarique Rahman: బంగ్లాదేశ్‌ ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం

బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ (BNP) పార్టీ చీఫ్‌ తారిక్ రెహమాన్ ఆ దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు మొహమ్మద్‌ షహబుద్ధీన్‌ ఆయన చేత ప్రమాణం స్వీకారం చేయించారు

New Update
BNP Chief Tarique Rahman sworn in as Prime Minister

BNP Chief Tarique Rahman sworn in as Prime Minister

బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ (BNP) పార్టీ చీఫ్‌ తారిక్ రెహమాన్ ఆ దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు మొహమ్మద్‌ షహబుద్ధీన్‌ ఆయన చేత ప్రమాణం స్వీకారం చేయించారు. ఇటీవల అక్కడ జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీఎన్‌పీ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మిత్ర పక్షాలతో కలిసి 299 స్థానాలకు 212 చోట్ల గెలిచింది.  17 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన తారిక్‌ రెహమాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టం ప్రాధాన్యం సంతరించుకుంది.ఈ కార్యక్రమానికి భారత్ తరపున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు.

Also Read : అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దుల్లో చైనా అణు ఆయుధాలు.. 600 న్యూక్లియర్‌ వార్‌హెడ్‌లు పెంచుకున్న డ్రాగన్

BNP Chief Tarique Rahman Sworn As PM

మరోవైపు ఇప్పటిదాకా ప్రభుత్వ సారథిగా వ్యవహారించిన మహమ్మద్ యూనస్‌ సోమవారం పదవి నుంచి తప్పుకున్నారు. ఈ సందర్భంగా చివరిసారిగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగం చేశారు. ఈ నేపథ్యంలోనే మరోసారి భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాలను సెవెన్‌ సిస్టర్స్‌ అంటూ ప్రస్తావించారు. '' బంగ్లాదేశ్‌కు విశాల సముద్రం భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో లింక్ అయ్యేందుకు బంగ్లాదేశ్‌కు ఉన్న మార్గం అదే. నేపాల్, భూటాన్, సెవెన్‌ సిస్టర్స్‌తో కలిసి ఈ ప్రాంతం ఆర్థిక సామర్థ్యం కలిగి ఉందని'' యూనన్ అన్నారు.  

గతంలో కూడా యూనస్‌ చైనా పర్యటన చేసినప్పుడు ఈశాన్య రాష్ట్రాల గురించి మాట్లాడారు. ఈ రాష్ట్రాల వాళ్లు సముద్రానికి చేరుకునేందుకు వేరే మార్గం లేదని.. ఈ ప్రాంతంలోని సముద్రానికి తామే రక్షకులం అని పేర్కొన్నారు. చైనా ఆర్థిక బేస్‌ను పెంచుకునేందుకు ఇది మంచి అవకాశమన్నారు. అయితే యూనస్ వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఇదిలాఉండగా  అరుణాచల్‌ ప్రదేశ్, అస్సాం, మణిపుర్‌, త్రిపుర, మిజోరం, నాగ్‌లాండ్, మేఘాలయా రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్‌ అని పిలుస్తారు. 

Also Read :  ఇమ్రాన్ ఖాన్‌కు సీరియస్.. జైలు నుంచి రహస్యంగా ఆస్పత్రికి తరలింపు

Advertisment
తాజా కథనాలు