/rtv/media/media_files/2026/04/15/hiv-2026-04-15-07-14-57.jpg)
BBC Eye investigates a hospital linked to outbreak of HIV among children in Pakistan
పాకిస్థాన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తౌన్సా నగరంలోని ఓ ప్రభుత్వం ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 331 మంది పిల్లలకు HIVకి గురయ్యారు. ఈ విషయాన్ని బీబీసీ తన దర్యాప్తులో వెల్లడించింది. నవంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 మధ్య కాలంలో ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు పేర్కొంది. పిల్లలు సురక్షితం కాని సూదులు వాడుతుండటం, అలాగే సిరంజీలు, వయల్స్ వాడినవే మళ్లీ వాడుతుండటం వల్ల ఈ ఇన్‌ఫెక్షన్ సోకినట్లు తెలిపింది.
Also Read: యుద్ధ ప్రభావం .. భారత్ లో 25 లక్షల మంది పేదరికంలోకి
ఒకే వయల్‌లో ఉన్న మందును పలువురు చిన్నారులకు ఎక్కించారని బీబీసీ వివరించింది. సిరంజీని మార్చకుండా వాడితే HIV సోకే ప్రమాదం ఉందని.. ఇలా చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరించారు. ఇంజెక్షన్లను వేడి నీళ్లలో శుభ్రపరచకుండా వాడినట్లు విచారణలో తేలింది. ఇటీవల 8 ఏళ్ల మొహమ్మద్ అమిన్ అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతిపై దర్యాప్తు చేపట్టాక ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అయితే ఆస్పత్రి సిబ్బంది మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. బీబీసీ చూపిస్తున్న ఫుటేజీ పాతదని లేదా బూటకమని వాదిస్తున్నారు. తాము అన్ని నిబంధనలు పాటిస్తున్నామని పేర్కొన్నారు.
Also Read: చర్చలు విఫలం.. హోటల్ బిల్లు ఎగ్గొట్టి...ఇజ్జత్ తీసుకున్నపాక్
Follow Us