/rtv/media/media_files/2025/04/01/DRlOHJ7ur6mcI4yLDPlC.jpg)
Muhammad Yunus Photograph: (Muhammad Yunus)
బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహ్మద్ యూనస్ గత వారం చైనా పర్యటనలో పాల్గొన్నారు. అయితే మహ్మద్ మాట్లాడుతూ.. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల గురించి ప్రస్తావించారు. భారత దేశానికి సముద్రం ఉందనే విషయాన్ని మరిచిపోయి మాట్లాడారు. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది.
ఇది కూడా చూడండి: Ashwani Kumar : డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
#BreakingNews | Bangladesh in economic turmoil, 140 garment factories closed since the August 5th@siddhantvm with @JamwalNews18 | #Bangladesh #BangladeshEconomy pic.twitter.com/QTSqU3sqRK
— News18 (@CNNnews18) March 31, 2025
ఇది కూడా చూడండి: IPL 2025: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్
లక్షలాది మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోవడంతో..
వస్త్ర పరిశ్రమ పూర్తిగా క్షీణించడంతో పాటు పెట్టుబడుదారులు కూడా నష్టాలను చవిచూస్తున్నారు. నిజానికి వస్త్ర పరిశ్రమ బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. కానీ ప్రస్తుతం వందలకు పైగా వస్త్ర పరిశ్రమలను మూసి వేశారు. దీంతో లక్షలాది మంది కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. దీనివల్ల ఆహారానికి చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఎక్కువగా ఢాకాలో ఈ ఆర్థిక సంక్షోభం కనిపిస్తోంది.
ఢాకాలోని 103, గాజీపూర్‌లో 70, నారాయణగంజ్‌లో 23, సవర్-అషులియాలో 41 ఫ్యాక్టరీలను క్లోజ్ చేశారు. నిధుల కొరత, ఆర్డర్లు లేకపోవడం, ప్రభుత్వం నుంచి స్పష్టమైన దిశానిర్దేశం లేకపోవడం వస్త్ర పరిశ్రమ పడిపోతుంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 71 శాతం వరకు పెట్టుబడులు తగ్గాయి. ప్రభుత్వం కూడా ఆర్థిక పెరుగుదల కోసం ఏం చేయడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. ఇలానే ఉంటే.. బంగ్లాదేశ్‌కు తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని అంటున్నారు.
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్!