/rtv/media/media_files/2025/04/13/Gm8FCsUURje7uNnRYiCG.jpg)
Sheikh Hasina
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి న్యాయస్థానం ఇటీవల అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అధికార దుర్వినియోగంతో అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారని హసీనాతో పాటు
ఆమె కూతురు సైమా వాజెద్ పుతుల్, మరికొందరపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి హసీనాపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.
Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ
ఇక వివరాల్లోకి వెళ్తే.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి రెహనా, బ్రిటీష్ ఎంపీ తులిప్ రిజ్వానా సిద్ధిక్, మరో 50 మందిపై అవినీతి నిరోధక కమిషన్ బంగ్లాదేశ్ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై పరిశీలన చేసిన కోర్టు.. అరెస్టు వారెంట్లు జారీ చేసిందని పలు మీడియా కథనాలు తెలిపాయి. తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 27కు వాయిదా వేసినట్లు చెప్పాయి. మరోవైపు అక్రమంగా నివాస స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలపై షేక్ హసీనా, ఆమె కూతురు సైమా వాజెద్ పుతుల్, మరో 17 మందిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.
Also Read: జలియన్ వాలాబాగ్ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?
ఢాకా శివారులో ఉన్న పుర్బాచల్‌లో ప్రభుత్వ అధీనంలో ఉన్న భూమి లీజుకు సంబంధించిన అభియోగంపై ఏసీసీ తన దర్యాప్తు రిపోర్టును కోర్టుకు సమర్పించింది. షేక్ హసీనా, ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఢాకాలో ఇళ్లు ఉన్నప్పటికీ.. నివాసం స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు చేసింది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉండటం వల్ల ఇటీవల కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.అయితే తాజాగా మరోసారి కోర్టు అరెస్టు వారెంట్ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?
telugu-news | rtv-news | sheik-hasina | international