/rtv/media/media_files/2025/03/28/v6nzw9ew6dvuJgSZklET.jpg)
Earthquake in Bangkok
Myanmar Earthquake: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో(Bangkok) భారీ భూకంపం సంభవించడం కలకలం రేపుతోంది. భూ ప్రకంపనాల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భవనం కూలిన ఘటనలో 7 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. మరో 43 మంది కార్మికులు శిథిలాల కిందే చిక్కుకున్నట్లు అక్కడి లోకల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Also Read: BIG BREAKING: బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. నేలమట్టమైన భవనాలు
A new high-rise building being constructed in Chatuchak, near the world’s largest weekend market, did not manage to survive the earthquake and collapsed quite massively! Hopefully no one got killed or badly inured. pic.twitter.com/ukyCEBXn7i
— Joseph Çiprut (@mindthrust) March 28, 2025
Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!
బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ..!
ఆ భవనం కూలిన తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తి ఆర్తనాదాలు చేసిన వీడియో బయటికొచ్చింది. కాపాడండి ప్లీజ్ అంటూ అతడు వాపోయిన దృశ్యాలు చూపరులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు భూకంపాల ధాటికి థాయ్‌లాండ్ ప్రభుత్వం.. బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ ప్రకటించింది.
Bangkok Earthquake Building collapse Jatujak.
— 360_degrees_of_symmetry (@360DegreesofCam) March 28, 2025
Check this dude out.
So far 7 alive at least 43 still
Missing.
Unconfirmed how many people were on site pic.twitter.com/nYYmMPiCCj
🚨43+ Workers Dead or Trapped In Bangkok Earthquake High Rise Collapse. 7 escaped, 1 confirmed dead. (Thai TV News)
— DonaldBest.CA * DO NOT COMPLY (@DonaldBestCA) March 28, 2025
🚨Massive Damage in Northwest Thailand
🚨8.2 magnitude earthquake epicenter near Mae Hong Sorn, Thailand on Myanmar border.
🚨Highway Bridge collapse in Chiang… https://t.co/ljxwCUSbsp pic.twitter.com/41dgg1nWya
Also Read: విల్లాస్‌లో హై ప్రొఫైల్ శృంగార క్రీడ.. కానిస్టేబుల్ కస్టమర్‌గా వెళ్లడంతో గుట్టు రట్టు!
సెంట్రల్ మయన్మార్‌లోని మోనివా సిటీకి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 12 నిమిషాల వ్యవధిలోని మయన్మార్‌లో రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది. దీని ప్రభావంతోనే థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో రెండుసార్లు తీవ్ర ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బ్యాంకాక్‌లో భూ ప్రకంపనల తీవ్రత 6.4, 7.3గా నమోదైంది. భూకంప ప్రభావంతో వందలాది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 15 మృతదేహాలు లభ్యమైనట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: ఒక్క సిరంజీ . 10 మందికి ఎయిడ్స్!