Australia: ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. ఆర్మీ చీఫ్‌గా తొలిసారిగా మహిళ నియామకం

ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ రక్షణ రంగంలో తొలిసారిగా ఓ మహిళా అధికారిణి ఆర్మీ చీఫ్‌గా నియమించింది. ఈ ఏడాది జులై నుంచి సైన్యాధిపతిగా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.

New Update
Australia Names First Female Army Chief in Historic Move

Australia Names First Female Army Chief in Historic Move

ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ రక్షణ రంగంలో తొలిసారిగా ఓ మహిళా అధికారిణి ఆర్మీ చీఫ్‌గా నియమించింది. ప్రస్తుతం జాయింట్  కేపబిలిటీస్‌ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సుసన్‌ కోయెల్.. ఈ ఏడాది జులై నుంచి సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని ఆల్బనీస్‌ సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. లెఫ్టినెంట్ జనర్ సైమన్ ఆండ్రూ స్టువర్ట్ స్థానంలో ఆర్మీ చీఫ్‌గా కోయెల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. 

Also Read: ట్రంప్‌నకు ప్రధాని మోదీ ఫోన్‌...ఏకంగా 40 నిమిషాల పాటు..

ఆస్ట్రేలియా సైన్యంలో మహిళా అధికారుల సంఖ్యను పెంచేందుకే కోయెల్‌ను ఆర్మీ చీఫ్‌గా నియమించారు. ప్రస్తుతం అక్కడి సైన్యంలో  లైంగిక వేధింపులు, వివక్ష లాంటి ఆరోపణలు వస్తున్నాయి. అందుకే 125 ఏళ్ల తమ దేశ ఆర్మీ చరిత్రలో మొదటిసారిగా ఓ మహిళను ఆర్మీ చీఫ్‌గా నియమిస్తున్నామని ప్రధాని ఆంటోనీ స్పష్టం చేశారు. ఇక రక్షణమంత్రి రిచర్డ్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కోయెల్ నియామకాన్ని ఆయన చారిత్రక ఘట్టంగా పేర్కొన్నారు. ఆస్ట్రేలియా సైన్యంలో సేవలందిస్తున్న మహిళలకు, భవిష్యత్తులో చేరాలనుకుంటున్న మహిళలకు ఇది ఆదర్శంగా ఉంటుందని తెలిపారు. 

Also Read: పాకిస్థాన్‌లో షాకింగ్ ఘటన.. 331 మంది పిల్లలకు HIV

ఇదిలాఉండగా కోయెల్‌కు ప్రస్తుతం 55 ఏళ్లు. 1987లో ఆమె సైన్యంలో సైన్యంలో చేరారు. తన సర్వీసులో అనేక ఉన్నత కమాండ్ బాధ్యతలు నిర్వహించారు. ఆస్ట్రేలియా సైన్యంలో సుమారు 21 శాతం మంది మహిళలు ఉన్నారు. వీళ్లలో ఉన్నత నాయకత్వ స్థానాల్లో 18.5 శాతం మంది ఉన్నారు. ఇక 2030 నాటికి మహిళలను 25 శాతానికి పెంచాలని ఆస్ట్రేలియా టార్గెట్ పెట్టుకుంది. 

Advertisment
తాజా కథనాలు