/rtv/media/media_files/2026/05/22/at-least-25-killed-in-two-separate-shootings-in-honduras-2026-05-22-09-47-42.jpg)
At least 25 killed in two separate shootings in Honduras
మధ్య అమెరికా దేశమైన హోండురాస్‌లో రెండు వేర్వేరు కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. సాయుధ దుండగులు జరిపిన ఈ దాడిలో ఆరుగురు పోలీసులతో సహా మొత్తం 25 మంది మృతి చెందారు. దేశంలోని ఉత్తర ప్రాంతంలోని ట్రుజిల్లో మున్సిపాలిటీ పరిధిలోని రిగోరెస్ అనే మారుమూల తోట ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానిక చర్చి దగ్గర కార్మికులందరూ ఒకచోట గుమిగూడిన సమయంలో అక్కడికి వచ్చిన సాయుధ దుండగులు వాళ్లపై విచక్షణారహితంగా దాడులు చేశారని స్థానిక మీడియా వెల్లడించింది.
Also Read: మళ్లీ భయపెడుతున్న కరోనా.. కొత్తగా 12,700 కేసులు..
అయితే ఈ దారుణమైన ఉదంతం వెనుక భూవివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర హోండురాస్‌లోని అత్యంత సారవంతమైన వ్యవసాయ భూములను దక్కించుకునేందుకు సాయుధ ముఠాలు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్థానిక రైతులను, కార్మికులను వాళ్ల సొంత భూముల నుంచి బలవంతంగా వెళ్లగొట్టేందుకు ఇలాంటి ప్రాణాంతక దాడులకు తెగబడుతున్నారని మానవ హక్కుల నిపుణులు వెల్లడిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ దాడి కూడా ఈ భూ ఆధిపత్య పోరులో భాగమేనని చెబుతున్నారు.
Also Read: యుద్ధం కొనసాగితే భారత్‌కు భారీ షాక్... ఐఎంఎఫ్ మాజీ చీఫ్ గీతా గోపీనాథ్ హెచ్చరిక..
ఈ ఘటనపై హోండురాస్ సాయుధ దళాల సంయుక్త విభాగాధిపతి హెక్టర్ బెంజమిన్ వలేరియా సైతం తీవ్రంగా స్పందించారు. ఈ ఘోరానికి పాల్పడ్డ నిందితులను వదిలివెళ్లే ప్రసక్తే లేదన్నారు. వాళ్లని త్వరలోనే పట్టుకుని చట్టం ముందుకు తీసుకొస్తామని చెప్పారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో భద్రతా బలగాలు, ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగి ముమ్మరంగా ఆధారాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు వేగంగా సాగుతోందని అన్నారు.
Follow Us