Sunita Williams: అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపింది వీరే.. సునీతా విలియమ్స్ కంటేముందే ఇద్దరు మహిళలు

అంతరిక్షంలో అత్యధికంగా గడిపిన వారిలో సునీతా విలియమ్స్ ఆరో స్థానంలో ఉన్నారు. 1వ స్థానంలో ఫ్రాంక్ రూబియో 371 రోజులున్నారు. సునీతా విలియమ్స్ కంటే ఎక్కువ రోజులు ఇద్దురు మహిళలు స్పేస్‌లో గడిపారు. క్రిస్టినా కోచ్ 328 రోజులు, పెగ్గీ విట్సన్ 289 రోజులు ఉన్నారు.

New Update
nasa astronauts

nasa astronauts Photograph: (nasa astronauts)

Sunita Williams: మనం భూగ్రహంపై అన్నీ సౌకర్యాలతో సుఖంగా ఉంటున్నాము. మరి విశ్వంలో పరిశోధనలు, ప్రయోగాల కోసం వెళ్లిన వారి పరిస్థితి ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా. స్పేస్‌లో ఆస్ట్రోనాట్స్ రోజుల తరబడి ఎలా జీవిస్తారో తెలుసా? అత్యధిక రోజులు విశ్వంలో ప్రయోగాలు చేసిన హోమగామిలు ఏడుగురు అమెరికన్స్‌యే ఉన్నారు. సునీతా విలియమ్స్ కంటే ముందే మరో మహిళ ఇంటర్‌నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఉన్నారు. సునీతా కంటే 100 రోజులు ఎక్కువగా 389 డేస్ ISSలో గడిపారు. ఎన్నో సవాళ్లును ఎదుర్కొని నెలల తరబడి అంతరిక్షంలో ఉన్న కొందరు శాస్త్రవేత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్‌ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!

ఫ్రాంక్ రూబియో

అందరి కంటే ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడిపిన వ్యక్తి అమెరికాకు చెందిన ఫ్రాంక్ రూబియో. ఈయన 371 రోజులు అంతరిక్షంలో అధ్యాయనం కోసం ఉన్నాడు. ఫ్రాంక్ రూబియో సింగిల్ స్పేస్ ఫ్లైట్‌గా రికార్డ్ సృష్టించారు. 

Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!

Also Read: స్పీడ్ పెంచేసిన డ్రాగన్ బ్యూటీ.. మళ్ళీ ఆ హీరోతో రిపీట్..

మార్క్ థామస్ వందే హే

మాజీ ఆస్ట్రోనాట్ మార్క్ థామస్ వందే హే అమెరికన్ సైంటిస్ట్. ఈయన అమెరికా సైన్యంలో కల్నల్, నాసాలో ఆస్ట్రానాట్‌గా సేవలందించాడు. సింగల్ స్పేస్ యాత్ర చేసిన వ్యక్తుల్లో మార్క్ థామస్ రెండవ స్థానంలో ఉన్నారు. 355 రోజులు అంతరిక్షంలో గడిపి రికార్డ్‌లో నిలిచారు.

స్కాట్ కెల్లీ

స్కాట్ కెల్లీ రిటైర్డ్ అమెరికన్ ఆస్ట్రోనాట్, ఇంజనీర్ కూడా. ఈయన యూఎస్ నావీలో కూడా పని చేశారు. అంతరిక్షంలో వరుసగా ఆయన 340 రోజులు జీవించారు. ఓ సారి ఈయన చేసిన అంతరిక్ష యాత్ర వరుసగా సంవత్సరం సాగింది.

Also read: Sunita Williams : సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ!

క్రిస్టినా కోచ్

క్రిస్టినా కోచ్ అమెరికన్ ఆస్ట్రోనాట్. ఈమె ఇంజనీర్‌గా కూడా పని చేశారు. అంతేకాదు అంతరిక్ష కేంద్రంలో ఎక్కువ రోజులు గడిపింది క్రిస్టినా కోచ్. 328 రోజులు అంతరిక్షంలో గడిపింది. సునీతా విలియమ్స్ కంటే ఈమె 103 రోజులు ఎక్కువ స్పేస్ సెంటర్‌లో గడిపింది. స్పేస్‌లో అత్యధిక రోజులు గడిపిన మహిళా ఆస్ట్రానాట్‌గా క్రిస్టినా కోచ్ చరిత్ర సృష్టించింది. 

పెగ్గీ విట్సన్

పెగ్గీ విట్సన్ ఆస్ట్రానాట్‌తోపాటు బయో కెమికల్ సైంటిస్ట్. అంతరిక్ష పరిశోధనలో ఈమెకు అనేక రికార్డులు ఉన్నాయి. స్పేస్‌లో అత్యధిక రోజులు గడిపిన రెండవ మహిళగా పెగ్గీ విట్సన్ ఉన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కమాండర్‌గా పని చేసిన తొలి మహిళ. 289 రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఫస్ట్ మహిళా కమాండర్. ఈమె సునీతా విలియమ్స్ కంటే 3రోజులు ఎక్కువ పెగ్గీ విట్సన్ ISSలో ఉన్నారు.

Also read: Sunita Williams : గుజరాత్‌లో సునీతా విలియమ్స్ బావ యజ్ఞం

సునీతా విలియమ్స్

అత్యధిక రోజులు అంతరిక్షంలో గడిపిన వారి లిస్ట్‌లో సునీతా విలియమ్స్ ఆరో స్థానంలో ఉన్నారు. ఈమె కంటే ముందు ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. 2024 జూన్ 5న ఇంటర్‌నేషనల్ స్పేస్ సెంటర్‌కు వెళ్లిన సునీతా విలియమ్స్ 2025 మార్చి 19న భూమిపై కాలు పెట్టబోతున్నారు. ఇంతకు ముందు కూడా ఈమె అనేక సార్లు స్పేస్ వాక్ చేసింది. మొత్తంగా అంతరిక్షంలో 289 రోజులు గడిపారు.

ఆండ్రూ మోర్గాన్

ఆండ్రూ మోర్గాన్ నాసా ఆస్ట్రోనాట్‌గా కాకుండా రిటైర్డ్ యూఎస్ ఆర్మీ ఆఫీసర్‌గా కూడా పని చేశారు. ISSలో 272 రోజులు గడిపారు. శాస్త్రీయ పరిశోధనలు చేశారు.

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు