/rtv/media/media_files/2024/11/02/x5llk8t9Gs6iTBmfypl7.jpeg)
ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) యే తన బిడ్డకు తండ్రి అంటూ కొద్ది రోజుల క్రితం రచయిత ఆష్లీ సెయింట్ క్లెయిర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో .. మస్క్‌తో తనకు బంధం ఎలా ఏర్పడిందో వివరించారు. ముఖ్యంగా తాను ఆయన్ను ఓ ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లగా అక్కడే ఇద్దరు ప్రేమలో పడి బిడ్డను కనేంత వరకు వెళ్లినట్లు ఒప్పుకున్నారు. అప్పటి నుంచే తమ మధ్య సంబంధం ఏర్పడిందని.. అది చాలా రోజులు కొనసాగినట్లు వివరించారు. అయితే అందుకు బదులుగా మస్క్ తనకు ఏమిచ్చాడో కూడా నిర్మొహమాటంగా వెల్లడించారు.
మస్క్ చాలా ఫన్నీగా...
తన ఐదు నెలల బిడ్డకు టెస్లా (Tesla) అధినేత ఎలాన్ మస్క్‌యే తండ్రని చెప్పిన ఆష్లీ సెయింట్ క్లెయిర్.. అందరికీ షాక్ ఇచ్చారు. 53 ఏళ్ల మస్క్ చాలా ఫన్నీగా ఉంటారని.. అది చూసే అతడిని ఇష్ట పడినట్లు చెప్పారు. అంతేకాకుండా ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నా చాలా సాదాసీదాగా ఉంటూ.. చాలా తెలివిగా వ్యవహిరిస్తారని వివరించారు. అందుకే తమ మధ్య 27 ఏళ్ల వ్యత్యాసం ఉన్నా అతడితో ప్రేమలో పడ్డట్లు వివరించారు.
Also Read: Nara lokesh: ఏపీలో టీచర్లకు తీపికబురు చెప్పిన మంత్రి లోకేష్
మస్క్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లానని చెప్పిన అష్లీ క్లెయిర్.. అప్పుడే తొలి సారిగా ఆయన్ను చూసినట్లు వెల్లడించారు. ఈక్రమంలోనే మస్క్.. మీరు ఎప్పుడైనా శాన్‌ఫ్రాన్సిన్సోకు, ఆస్టిన్‌కు వచ్చారా అంటూ అడగ్గా.. తాను ఓసారి వచ్చినట్లు చెప్పారట. ఇలా తొలి చూపులోనే ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడగా.. ఇంటర్వ్యూ అయిన వెంటనే డేటింగ్ కి వెళ్లినట్లు తెలిపారు. ఆపై తాను హోటల్‌కు వెళ్లిపోగా.. మస్క్ ఓ మెసేజ్ చేశారని పేర్కొన్నారు. అందులో ఇద్దరం కలిసి రోడ్ ఐలాండ్‌కు వెళ్దామని ఉన్నట్లు చెప్పుకొచ్చారు
అలా మొదలైన తమ బంధం తాను గర్భం దాల్చే వరకూ తరచుగా కొనసాగిందని ఆష్లీ క్లెయిర్ వెల్లడించారు. అయితే బిడ్డ పుట్టబోతున్నట్లు తెలిసిన తర్వాత ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని మస్క్ కోరాడని.. అందుకే తాను ఈ విషయాన్ని దాచినట్లు వివరించారు. కానీ కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని బయటపెట్టడంతోనే.. తన బిడ్డ కోసం తానీ నిజం అందరికీ చెప్పినట్లు తెలిపారు.
మస్క్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లానని చెప్పిన అష్లీ క్లెయిర్.. అప్పుడే తొలి సారిగా ఆయన్ను చూసినట్లు వెల్లడించారు. ఈక్రమంలోనే మస్క్.. మీరు ఎప్పుడైనా శాన్‌ఫ్రాన్సిన్సోకు, ఆస్టిన్‌కు వచ్చారా అంటూ అడగ్గా.. తాను ఓసారి వచ్చినట్లు చెప్పారట. ఇలా తొలి చూపులోనే ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడగా.. ఇంటర్వ్యూ అయ్యాక బాగా కనెక్ట్ అయినట్లు తెలిపారు. ఆపై తాను హోటల్‌కు వెళ్లిపోగా.. మస్క్ ఓ మెసేజ్ చేశారని పేర్కొన్నారు. అందులో ఇద్దరం కలిసి రోడ్ ఐలాండ్‌కు వెళ్దామని ఉన్నట్లు చెప్పుకొచ్చారు
Also Read: Hyderabad Crime: యూ బెగ్గర్ అని పిలిచేవాడు...అందుకే చంపేశా!
Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి... జాగ్రత్త!