Asaduddin Owaisi: ఇరాన్‌పై దాడుల్ని భారత్‌ ఖండించాలి.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మిడిల్‌ఈస్ట్‌లో యుద్ధ వాతారవణం కొనసాగుతోంది. దీనిపై తాజగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఇరాన్‌పై చేస్తున్న దాడులను భారత్‌ ఖండించాలన్నారు.

New Update
Asaduddin Owaisi

Asaduddin Owaisi

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మిడిల్‌ఈస్ట్‌లో యుద్ధ వాతారవణం కొనసాగుతోంది. దీనిపై స్పందించిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఈ దాడులను ఖండించారు. ఇరాన్‌పై చేస్తున్న దాడులను భారత ప్రభుత్వం కూడా ఖండించాలన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హత్య చేయడం చట్ట విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన షియా సమాజానికి గొప్ప నాయకుడని వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై దాడులను వెంటనే ఆపాలని.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తనవంతు పాత్ర వహించాలంటూ డిమాండ్ చేశారు. 

Also Read: పెళ్లి చేసుకుంటానని ఒకడు, సాయం చేస్తానని మరొకడు అత్యాచారం.. పాపం చివరికి!

ఈ దాడులు ఇలానే కొనసాగుతూ పోతే గల్ఫ్‌ దేశాల్లో తీవ్రమైన అస్థిరత, అశాంతి నెలకొనే ప్రమాదం ఉందన్నారు. భారత ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో శాంతి ప్రయత్నాలకు క-ృషి చేయాలని తెలిపారు. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు వివిధ ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. అక్కడ యుద్ధం ఇలాగే కొనసాగితే తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు భారతీయులు కూడా అక్కడే చిక్కుకునే ప్రమాదం ఉందన్నారు. 

Also Read: ఖమేనీ మరణం.. కర్ణాటకలోని ఆ గ్రామంలో సంతాప దినాలు

ఇదిలాఉండగా అలీ ఖమేనీ మృతితో హైదరాబాద్‌లోని పాతబస్తీలో నిరసనలు జరిగాయి. పురాని హవేలీలోని తంజీమ్ ఈ జాఫెరీ అనే సంస్థ ఖమేనీ మృతికి సంతాపంగా ర్యాలీ చేపట్టింది. భారీ సంఖ్యంలో ముస్లింలు రోడ్ల పైకి వచ్చి ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పాతబస్తీలో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఖమేనీ మృతితో హైదరాబాద్‌లో నిరసనలు చేయడం కలకలం రేపుతోంది.  శనివారం ఉదయం  అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేపట్టిన దాడుల్లో అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఖమేనీతోపాటు ఆయన కూతురు, అల్లుడు, కోడలు, మనుమడు కూడా మృతి చెందారు. 

Advertisment
తాజా కథనాలు