మరికొన్ని్ రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. ఢిల్లీ పరిధిలోని మెట్రో రైళ్లలో ప్రయాణించే స్కూల్, కాలేజీ విద్యార్థులకు 50 శాతం టికెట్ రాయితీ అమలు చేయాలని కోరారు. రాయితీ వల్ల పడే ఆర్థిక భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో భరించాలని సూచనలు చేశారు.
Also Read: ఘోర ప్రమాదం.. 40మంది పాకిస్థానీ వలసదారులను మింగేసిన సముద్రం.. ఎక్కడంటే?
'' స్కూల్, కాలేజీ విద్యార్థులు మెట్రోలో ప్రయాణాలు చేస్తున్నారు. వాళ్లపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు 50 శాతం రాయితీని అందించాలని ప్రతిపాదిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో ఖర్చులు భరించాలని సూచిస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తాం. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందిస్తున్నామని'' కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు. ఆయన రాసిన లేఖపై కేంద్రం ఇంకా స్పందించలేదు.
Also Read: నాగ సాధువులు రోజులో ఎంత తింటారు..ఎక్కడ ఉంటారు అంటే!
మరోవైపు కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వంపై విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఢిల్లీ ఎయిమ్స్ రోగులు, వాళ్ల బంధువులు ఎదుర్కొంటున్న పరిస్థితి గురించి ఓ వీడియోను షేర్ చేశారు. చికిత్స కోసం రోగులు కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రోగుల బంధువులు చలిలో సబ్‌వేలు, ఫుట్‌పాత్‌లపై నిద్రపోవాల్సిన పరిస్థితి ఉందని విమర్శించారు. ఇదిలాఉండగా.. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారనేది దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.