/rtv/media/media_files/2026/03/24/anthropic-2026-03-24-20-51-40.jpg)
Anthropic Unveils 'Computer Use' Claude AI Now Operates Your PC Like a Human
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల టెక్నాలజీ రంగంలో సంచలనం సృష్టించిన ఆంత్రోపిక్ సంస్థ మరో వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. తాజాగా తన క్లాడ్ ఏఐ మోడల్‌కు సంబంధించి కంప్యూటర్ యూజ్ ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ టూల్ అనేది కేవలం అడిగిన సమాధానాలు ఇవ్వడమే కాకా.. కంప్యూటర్‌ను కూడా ఆపరేట్ చేయగలదు. అంటే ఓ మనిషి లాగే కర్సర్‌ను కదిలించడం, కావాల్సిన వాటిపై క్లిక్ చేయడం, యాప్‌లు తెరవడం, ఫామ్‌లు నింపడం లాంటి పనులను తేలికగా చేస్తుంది.
అయితే ఈ ఫీచర్ క్లాడ్ ప్రో, మాక్స్ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే మాక్ ఓఎస్ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉంది. మీరు ఏదైనా పని చెబితే క్లాడ్ దాన్ని పూర్తిచేస్తుంది. ముందుగా స్లాక్, గూగుల్ క్యాలెండర్ లాంటి వాటితో డైరెక్ట్‌గా కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ఒకవేళ ఆ సౌకర్యం కుదురకపోతే మీ స్క్రీన్‌ను కంట్రోల్‌లోకి తీసుకుంటుంది. కానీ కొత్త అప్లికేషన్‌ను ఒపెన్ చేసేముందు మీ పర్మిషన్ కోరుతుంది. మీ ప్రయాణంలో ఉన్నప్పుడు ఫోన్ నుంచి డిస్పాచ్ టూల్‌ను వాడి టాస్క్‌లు ఇస్తే.. మీరు ఆఫీసుకు వచ్చే సమయానికి మీ డెస్క్‌టాప్‌పై ఆ పని పూర్తవుతుంది.
Also Read: ఒకవైపు శాంతి చర్చలంటూనే...మరోవైపు ఇరాన్ పై బాంబుల వర్షం
భద్రత విషయంలో కూడా ఆంత్రోపిక్ హెచ్చిరికలు చేసింది. మీ కంప్యూటర్ నియంత్రణను ఏఐకి ఇస్తే ప్రాంప్ట్ ఇంజెక్షన్ లాంటి ముప్పు కూడా వచ్చే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉదాహణకు ఏదైనా వెబ్‌సైట్‌లోని మానిప్యులేటెడ్ కోడ్ ద్వారా క్లాడ్ తాను చేయాల్సిన పని కాకుండా తప్పుగా ప్రవర్తించే ప్రమాదం ఉంది. ఇలాంటి తప్పులు జరగకుండా దీన్ని నియంత్రించేందుకు రియల్‌టైన్ స్కానింగ్ సిస్టమ్‌ను కూడా రూపొందించింది. అలాగే కొన్ని సున్నితమైన యాప్‌లను కూడా డీఫాల్ట్‌గా ఆఫ్ చేసింది.
ప్రస్తుతం ఇది ఇంకా పరిశోధన దశలోనే ఉంది. కాబట్టి కొన్ని కఠినమైన పనులకు ఒకటి కన్నా ఎక్కువ ప్రయత్నాలు అవసరమవుతాయని ఆంత్రోపిక్ చెబుతోంది. ఏఐ ఏజెంట్ల విభాగంలో ఇప్పుడు క్లాడ్.. ఓపెన్‌క్లా, ఎన్విడియా నెమోక్లా లాంటి వాటితో పోటీ పడుతోంది. వేరే సంస్థలు డెవలపర్ టూల్స్‌పై ఫోకస్ పెట్టాయి. కానీ ఆంత్రోపిక్ మాత్రం సామాన్య వినియోగదారులకు కూడా సులభంగా ఉండేలా, భద్రత ఉండేలా పాలిష్డ్ ప్రొడక్ట్‌ను ఇవ్వాలని చూస్తోంది. అయ్తే ఈ కంప్యూటర్ యూజ్ ఫీజర్ వల్ల ఏఐ అనేది కేవలం చాట్‌బాట్‌గా కాకుండా మన పనులు పూర్తి చేసే వర్చవల్ అసిస్టెంట్‌గా మారనుంది. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ ఓ విప్లవాత్మకత మార్పును తీసుకొస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
Follow Us