/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/satya-jpg.webp)
ప్రముఖ టెక్ సంస్థల్లో పని చేసే వ్యక్తులు, వ్యాపార దిగ్గజాలు ఈ మధ్య తరచూ యూట్యూబ్ పాడ్ కాస్ట్ లో కనిపిస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఇక వీరిని షోకు రప్పించేందుకు యూట్యూబర్లు చాలానే శ్రమించాల్సి వస్తుంది. కానీ భారత సంతతికి చెందిన ఓ యూట్యూబర్ మాత్రం కేవలం నాలుగు నిమిషాల్లో టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ను ఇంటర్వ్యూకు ఒప్పించాడు.
Also Read: Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే..సూపర్ గా ముందుకు దూసుకుపోండి!
చిన్న ఇ-మెయిల్ సాయంతో అనుకున్న పని సాధించాడు.అమెరికాలో నివాసం ఉంటున్న భారత సంతతికి చెందిన ఓ యూట్యూబర్ ద్వారకేశ్ పటేల్..ప్రముఖులు,టెక్ సంస్థ వ్యవస్థాపకులతో పాడ్‌కాస్ట్ లు చేస్తుంటాడు. తన ఛానల్ కు సంబంధించిన న్యూస్ లెటర్ సబ్ స్క్రైబర్ల లిస్ట్ లో ఉన్న నాదెళ్లను షోకు ఆహ్వానించేందుకు నేరుగా ఈ మెయిల్ పంపాడు.
Also Read: AP: ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులను తొలగించిన సర్కార్
హాయ్ సత్య..నా న్యూస్ లెటర్ సబ్‌స్క్రైబర్ లిస్ట్ లో మీరు ఉండడం గమనించా. నా షోలో పాల్గొనేందుకు మీరు ఆసక్తిగా ఉన్నారా? అంటూ చిన్ని మెయిల్ను పంపాడు. మార్క్ జుకర్ బర్గ్,టోనీ బ్లెయిర్ వంటి ప్రముఖులు ఇప్పటికే తన పాడ్ కాస్ట్ లో పాల్గొన్నట్లు అందులో వివరించారు.
ఈ మెయిల్‌ను పంపిన నాలుగు నిమిషాలల్లోనే సత్య నాదెళ్ల నుంచి సమాధానం రావడంతో యూట్యూబర్ ఆశ్చర్యపోయాడు. ద్వారకేశ్ తన ఆనందాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. ఈ మెయిల్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ లను నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు. తాజాగా ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను కూడా యూట్యూబ్, ఎక్స్ వేదికగా ఉంచాడు.
34 ఏళ్లుగా చాలా...
పాడ్ కాస్ట్ లో పాల్గొన్న నాదెళ్ల మైక్రోసాఫ్ట్ లో తన ప్రయాణం గురించి పంచుకున్నారు. గత 34 ఏళ్లుగా చాలా ఉత్సాహంగా కంపెనీలో పని చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ , క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అంశాల గురించి ఈ పాడ్ కాస్ట్ లో చర్చించారు.
Also Read: Zelensky-Starmer: ఉక్రెయిన్ కి మద్దతుగా బ్రిటన్ ప్రధాని!
Also Read: Yuzvendra Chahal : అధికారికంగా విడాకులు తీసుకున్న చాహల్-ధనశ్రీ!