భారతదేశంలోని ఓ గ్రామానికి అమెరికా మాజీ అధ్యక్షుడి పేరు పెట్టుకున్నారు. అమెరికా 39వ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ 100ఏళ్ల వయసులో డిసెంబర్ 29న కన్నుమూశారు. ఆయన గుర్తుగా ఇండియాలో ఓ గ్రామమే ఉండిపోయింది. జిమ్మీ కార్టర్ ఇండియాలో పర్యటించిన మూడో అమెరికా అధ్యక్షుడు. ఆయన భార్య రోసలిన్ కార్టర్‌తోపాటు ఇండియా వచ్చి ఓ గ్రామాన్ని పర్యటించారు. దీంతో గ్రామస్తులు ఆ ఊరికి జిమ్మీ కార్టర్ పేరు పెట్టుకున్నారు. ఇది కూడా చూడండి: Rave Party: తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం ఎమర్జెన్సీ తర్వాత.. కార్టర్‌కు భారత్‌తో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 1977లో ఎమర్జెన్సీ కాలం తర్వాత.. భారత్‌లో జనతా పార్టీ విజయం సాధించింది. అప్పుడు భారత్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు ఈయనే. 1978 జనవరి 2న భారత పార్లమెంట్‌ను ఉద్దేశించి నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా జిమ్మీ కార్టర్ మాట్లాడారు. అప్పటి ప్రధాన మంత్రి మోరార్జీ దేశాయ్. ఇది కూడా చూడండి: Jimmy Carter: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మృతి అంతేకాదు.. దేశరాజధానికి పక్కనే ఉన్న హర్యానాలోని నసీరాబాద్ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. దీంతో నసిరాబాద్‌కి కార్టర్‌పురి అని నామకరణం చేసుకున్నారు ఆ గ్రామస్థులు. 2002లో జిమ్మీకి నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినప్పుడు కూడా ఈ గ్రామంలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. భారత్‌తో వ్యక్తిగత సంబంధాలున్న ఏకైక వ్యక్తి యూఎస్ మాజీ ప్రెసిడెంట్ ఈయనే. ఇది కూడా చూడండి: Rohith Sharma: యశ్వస్విపై రోహిత్ ఆగ్రహం.. వెల్లువెత్తుతున్న విమర్శలు అతని తల్లి లిలియన్ 1960 దశాబ్ధం చివరలో పీస్ కార్ప్స్‌తో కలిసి భారతదేశంలో హెల్త్ వాలంటీర్‌గా పనిచేసింది. 1924న అక్టోబర్ 1 జన్మించిన జిమ్మీ కార్టర్ 1977 నుండి 1981 వరకు అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు. పల్లీ వ్యాపారి జిమ్మీ కార్టర్ జీవితం రాజకీయ మలుపుతిరిగి రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా ప్రెసిడెంట్ దాకా ఎదిగారు. ఆయన వందేళ్ల వయసులో చనిపోయారు. అత్యధిక సంవత్సరాలు జీవించిన యూఎస్ ప్రెసిడెంట్‌గా జిమ్మీ కార్టర్ రికార్డ్ సృష్టించారు. గతేడాది జిమ్మీ భార్య రోసలెన్ 96 ఏళ్ల వయస్సులో మృతి చెందింది. ఇది కూడా చూడండి: Manmohan Singh: మాజీ ప్రధాని అస్థికల నిమజ్జనం.. ఎక్కడ చేశారంటే?