/rtv/media/media_files/2026/05/29/fotojet-2026-05-29-11-03-50.jpg)
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, రహస్యంగా పనిచేసే నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(CIA). పెద్ద పెద్ద దేశాల గూఢచారులనే బురిడీ కొట్టించే ఈ సంస్థనే.. ఇందులో పనిచేసే ఓ అధికారి మోసం చేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. సీఐఏలో పనిచేసిన డేవిడ్ రష్ అనే వ్యక్తి సంస్థ నిధులను, విలువైన వస్తువులను కొల్లగొట్టి తన ఇంటిని బంగారు గనిలా మార్చుకున్నాడు. డేవిడ్ రష్ గతంలో సీఐఏలో ఉన్నత పదవిలో కొనసాగాడు. ఈ సమయంలోనే అతను తన హోదాను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ సొమ్మును భారీగా దోచుకున్నాడు. ముఖ్యంగా 2025-2026 మధ్య కాలంలో సంస్థ అవసరాల కోసం అంటూ భారీగా బంగారం, నగదును తీసుకున్నాడు.
ఇది కూడా చూడండి: Raidurgam : రియల్ ఎస్టేట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ రికార్డ్: రాయదుర్గంలో ఎకరం స్థలం రూ.237 కోట్లు!
A former CIA senior officer has been accused of stealing 300 gold bars and 35 luxury watches, worth more than $42 million combined.
— Pubity (@pubity) May 28, 2026
He allegedly lied on his resume in 2009 to get the position and may have been stealing from the U.S. government for almost 20 years. pic.twitter.com/rpAff916Jq
ఇది కూడా చూడండి: CM Siddaramaiah : రాజ్యసభ ఆఫర్ రిజెక్ట్.. సిద్ధరామయ్య సంచలన ప్రకటన!
భారీగా నగదు, ఖరీదైన వాచ్‌లు..
ఎక్కడా ఈ ఖర్చుల వివరాలను రికార్డుల్లో నమోదు చేయకుండా.. ఆ ఆస్తులను రహస్యంగా తన సొంత నివాసానికి తరలించాడు. సీఐఏ తన నిధుల వినియోగంపై తనిఖీలు చేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని ఎఫ్‌బీఐకి తెలిపారు. ఎఫ్‌బీఐ అధికారులు వర్జీనియాలోని రష్ నివాసంపై దాడి చేసినప్పుడు వాళ్లకు షాకింగ్ విషయాలు కనిపించాయి. దాదాపు రూ.382 కోట్ల విలువైన 303 కిలోల బంగారు బిస్కెట్లు, 2 మిలియన్ డాలర్ల నగదు, 35 అత్యంత ఖరీదైన రోలెక్స్ లగ్జరీ వాచ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: CM Revanth Reddy : మాకు ఇందిరమ్మ ఎంతో.. NTR కూడా అంతే : సీఎం రేవంత్ రెడ్డి
🚨 CIA OFFICER ARRESTED AFTER $40M IN GOLD FOUND AT HOME.
— The Content Factory (@tcf_updates) May 29, 2026
A former senior CIA officer, David Rush, is facing federal charges after investigators found more than 300 gold bars worth about $40 million in his home. Agents also discovered roughly $2 million in cash. Prosecutors say… pic.twitter.com/VzQaGsFMF0
ఇది కూడా చూడండి: Japan : ఇండియాకు జపాన్ బిగ్ షాక్: ఈగలున్నాయని మామిడి పండ్లపై బ్యాన్!
Follow Us