Beta Babies: మారిపోయిన జనరేషన్.. ఇకనుంచి పుట్టేవాళ్లందరూ బీటా బేబీస్

మనమందరం 2025లోకి అడుగుపెట్టేశాం. అయితే ఈ ఏడాదికి ఒక ప్రత్యేక ఉంది. ఇకనుంచి 2025 జనవరి ఒకటి నుంచి పుట్టేవారిని జనరేషన్‌ బీటాగా పిలవనున్నారు. 2025 నుంచి 2039 మధ్య జన్మించే తరాన్ని బీటా బేబిస్‌గా పిలవనున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Beta Babies

Beta Babies

మనమందరం 2025లోకి అడుగుపెట్టేశాం. అయితే ఈ ఏడాదికి ఒక ప్రత్యేకత ఉంది. ఇకనుంచి 2025 జనవరి ఒకటి నుంచి పుట్టేవారిని జనరేషన్‌ బీటాగా పిలవనున్నారు. 2025 నుంచి 2039 మధ్య జన్మించే తరాన్ని బీటా బేబిస్‌గా పిలవనున్నారు. అయితే ఈ బీటా జనరేషన్‌ టెక్నాలజీ యుగంలో పిల్లలు అత్యున్నతంగా ఎదుగుతారని నిపుణలు చెబుతున్నారు. అలాగే ఇంతకుముందున్న తరాలు ఎప్పుడూ చూడని సవాళ్లను ఎదుర్కొంటారని.. నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారని భావిస్తున్నారు.   

Also Read: ముంబయి కోర్టు సంచలన తీర్పు.. 8 మంది పాకిస్థానీయులకు 20 ఏళ్ల జైలుశిక్ష..

అయితే జనరేషన్ బీటా తరం 2035 నాటికి ప్రపంచ జనాభాలో 16 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఈ తరం 22వ శతాబ్దపు ప్రారంభానికి సాక్షంగా నిలుస్తారని చెబుతున్నారు. అంతేకాదు సాంకేతిక పరిణామాలు, కృత్రిమ మేధస్సు (ఏఐ), సామాజిక మార్పుల మధ్య బీటా తరం జీవితం గడుపుతుంది. అయితే ఈ తరం ప్రతి అంశంలో కూడా సాంకేతికతను వినియోగించడమే కాకుండా పర్యావరణ, సామాజిక సవాళ్లను కూడా ఎదుర్కోనుంది.    

Also Read: 17,800 వాహనాలు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన.. రూ.89 లక్షల ఫైన్

ఇదిలాఉండగా.. 1981-1996 మధ్య పుట్టిన వాళ్లను మిలీనియల్స్ అని పిలుస్తారు. 1996 - 2010 మధ్య పుట్టినవారిని జెనరేషన్ జెడ్ అని అంటారు. 2010 నుంచి 2024 మధ్య పుట్టిన తరాన్ని అల్ఫా జనరేషన్‌గా పరిగణిస్తారు. ఇక 2025 నుంచి 2039 మధ్య పుట్టిన తరాన్ని బీటా బేబీస్‌గా పిలవనున్నారు. అయితే బీటా బేబీస్‌ తరంపై టెక్నాలజీ యుగం సామాజిక పరిశోధకుడు మార్క్‌ మెక్‌క్రిండిల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. జనరేషన్ బీటా వారి జీవితాలు కృత్రిమ మేధా (AI) సాయంతోనే సాగుతాయని చెప్పారు. విద్య, ఆరోగ్యం, వినోదం, ఇతర విషయాల్లో వీళ్లు ఎక్కువగా ఏఐని వినియోగిస్తారని పేర్కొన్నారు.  

Also Read: ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. ట్యూషన్‌ టీచర్‌కు 111 ఏళ్ల జైలు శిక్ష!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!

ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇన్నాళ్లూ వారందరినీ పట్టుకుని.. తిరిగి వారి దేశాలకు యూఎస్‌ పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ వెళ్లకుండా పట్టుబడితో.. రోజుకు రూ.86 వేల జరిమానా విధిస్తామని డీహెచ్‌ఎస్‌ చెప్పింది.

New Update
America migrants

America migrants

అగ్రరాజ్యం అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వలసదారులపై ట్రంప్ యంత్రాంగం మరింత కఠినమైన చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే వారిపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ సర్కారు.. ఇప్పుడు మరింతగా వారిని వారి దేశాలకు పంపేందుకు సిద్ధమైంది. అక్రమ వలసదారులు తక్షణమే అమెరికా వీడి వెళ్లిపోవాలని లేకపోతే తీవ్రమైన చర్యలు తప్పవని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ నుంచి ఆదేశాలు వెలువడనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

వెళ్లకపోతే రోజుకు రూ.86 వేల జరిమానా విధిస్తామని, అది కూడా కట్టకపోతే వారు ఆస్తులను సైతం జప్తు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడే వారిని అమెరికా తిరిగి వారి దేశాలకు పంపిచేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నదే అయినా.. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత దీనిని చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. అక్రమ వలసదారులపై చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. 

Also Read: Musk-Trump: ఆయనో మూర్ఖుడు..ట్రంప్‌ సలహాదారుడి పై మస్క్‌ సంచలన వ్యాఖ్యలు!

ట్రంప్ ఆదేశాలతో అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే సెల్ఫ్ డిపోర్టేషన్ యాప్‌ను కూడా తీసుకువచ్చింది అమెరికా. ఈ యాప్ ద్వారా పేరు నమోదు చేసుకుని ఎవరికివారు స్వయంగా దేశం వీడి వెళ్లిపోయే వెసులుబాటు ఉంటుంది.అలా కాకుండా అధికారులు గుర్తిస్తే తమ పద్ధతుల్లో అక్రమ వలదారులను వెనక్కి పంపించాల్సి ఉంటుందని, ఇతర చర్యలు తీసుకుంటామని డీహెచ్ఎస్ అధికార ప్రతినిధి ట్రిసియా మెక్‌లాలిన్ మీడియాతో పేర్కొన్నారు. తుది ఆదేశాలు అందుకున్న తర్వాత కూడా దేశం వీడిపోకుంటే భారీ జరిమానా తప్పదని హెచ్చరించారు. 

ముఖ్యంగా సెల్ఫ్ డిపోర్టేషన్‌కు సంబంధించి హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం మార్చి 31న సోషల్ మీడియా వేదికగా కీలక సమాచారాన్ని పంచుకుంది. తమ తనిఖీల్లో పట్టుబడితే క్రమబద్ధీకరణకు ఎటువంటి అవకాశం ఉండబోదని, సంపాదించుకున్న డబ్బును కూడా నష్టపోవాల్సి వస్తుందని అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

బహిష్కరణ ఆదేశాలు అందుకున్న తర్వాత వెళ్లిపోకపోతే రోజుకు 998 డాలర్లు జరిమానా, సెల్ఫ్ డిపోర్ట్ యాప్‌లో నమోదు చేసుకున్న తర్వాత వెళ్లపోకపోతే రోజూ 1000- 5 వేల డాలర్లు జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. భవిష్యత్తులో అమెరికాకు తిరిగి వచ్చే అవకాశం కూడా కోల్పోతారని పేర్కొంది.

డొనాల్డ్ ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఈ జరిమానాలకు సంబంధించి 1996లో తీసుకువచ్చిన చట్టాన్ని అప్పుడు తొలిసారి అమలు చేస్తున్నారు. 9 మంది అక్రమ వలసదారులపై జరిమానా విధించినప్పటికీ, అందులో కొందరిపై ఉపసంహరించుకున్నారు. ట్రంప్ తర్వాత బైడెన్ వచ్చాక జరిమానాలు విధించడాన్ని నిలిపివేశారు. అక్రమ వలసదారుల్లో భయాన్ని కలిగించేందుకు ఈ జరిమానాలను తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.

Also Read: Ap weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం...ఏపీలో వర్షాలు..

Also Read: Canada: కెనడా రాజకీయాల్లో కొత్త ట్రెండ్

america | migrants | illeagal-migrants | illegal immigrants america | Indian illegal immigrants | america illegal immigrants news | Immigrants | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment