BIG BREAKING: పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. 9 మంది దుర్మరణం

పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ఓ మార్కెట్‌లో తాజాగా బాంబు పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్దీ ప్రజలు గాయాలపాలయ్యారు.

New Update
9 killed in blast in northwest Pakistan market

9 killed in blast in northwest Pakistan market

పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ఓ మార్కెట్‌లో తాజాగా బాంబు పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్దీ ప్రజలు గాయాలపాలయ్యారు. నౌరంగ్ బజార్‌లో జరిగిన ఈ దాడి తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన వల్ల ఆఫ్ఘనిస్తాన్‌తో మళ్లీ సరిహద్దు పోరు రాజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఘటనా స్థలంలో దుకాణాలు, వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. క్షతగాత్రులను రక్షించేందుకు స్థానికులు, అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. 

ఇదిలాఉండగా గత శనివారం కూడా బన్నూ జిల్లాలోని ఓ పోలీస్ పోస్ట్‌పై జరిగిన బాంబు దాడిలో 15 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరవకముందే మరో పేలుడు సంభవించింది. శనివారం జరిగిన దాడికి ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులే కారణమని పాకిస్తాన్ ఆరోపించింది. కానీ అఫ్గాన్ మాత్రం దీన్ని ఖండించింది. పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాదం వాళ్ల అంతర్గత సమస్యని.. తాము ఎవరికీ ఆశ్రయం ఇవ్వడం లేదని తాలిబాన్ వాదనలు వినిపిస్తోంది.

అయితే తాజాగా జరిగిన బాంబు దాడి వెనుక తాలిబన్ల హస్తం ఉండే ఛాన్స్ ఉందని పలువురు పాక్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడిలో గాయపడ్డవారిని మెరుగైన చికిత్స కోసం బన్నూలోని ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటివరకు తమ ఆసుపత్రికి 37 మంది బాధితులు వచ్చారని  టీహెచ్‌క్యూ (THQ) ఆసుపత్రి అధికారులు తెలిపారు. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరిలో పాకిస్థాన్‌.. అఫ్గాన్‌పై వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా పాక్‌లో బాంబు పేలుళ్ల ఘటనలు జరగడం కలకలం రేపుతోంది. 

Advertisment
తాజా కథనాలు