/rtv/media/media_files/2025/01/02/TC4JeTtqmk0QFqfpUuPR.jpg)
Earthquakes occurred in Prakasam
దక్షిణ జపాన్‌లోని క్యుషు ప్రాంతంలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప కేంద్రం 37 కి. మీ లోతులో ఉందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. హ్యుగా-నాడా సముద్రంలో భూకంపం సంభవించినట్లు జపాన్ భూకంప పర్యవేక్షణ ఏజెన్సీ పేర్కొంది. ప్రకంపనలతో ఈ ప్రాంతం అంతటా బిల్డింగులు షేక్ అయ్యాయి. భయంతో జనం పరుగులు తీశారు. సునామి సంభవించే ప్రమాదం ఉందని అధికారులు తీర ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు.
#BREAKING news : Earthquake of magnitude 6.6 strikes kyushu in japan . The earthquake was at depth of 37 km#kyushu #Japan #Earthquakeinjapan pic.twitter.com/Yl8g5mceG5
— Anshul (@anshulmumbaidel) January 13, 2025
ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. గతేడాది ఆగస్టు 8న జపాన్‌లో 6.9, 7.1 తీవ్రతతో రెండు పవర్ ఫుల్ ఎర్త్‌కేక్స్ వచ్చాయి. జనవరి 13న (ఈరోజు) సంభవించిన భూకంపం నైరుతి దీవులైన క్యుషు, షికోకులను ప్రభావితం చేసింది. అధికారులు పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఎంతమేరకు ఆస్తినష్టం జరిగిందని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ప్రభుత్వ అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.
Another video capturing the shaking of the M6.8 earthquake that struck Japan today...pic.twitter.com/0H85bbXTh9
— Volcaholic 🌋 (@volcaholic1) January 13, 2025
పలు టెక్టానిక్ ప్లేట్లు కలిసే రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో జపాన్ ఉంది. దీంతో తరచు అక్కడ భూకంపాలు వస్తుంటాయి. 2024 జనవరి 1న కూడా సుజ, వజీమాలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.