/rtv/media/media_files/2026/04/03/5-indians-among-12-injured-after-debris-due-to-interception-falls-in-abu-dhabi-2026-04-03-20-38-13.jpg)
5 Indians among 12 injured after debris due to interception falls in Abu Dhabi
పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తుండగా.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే శుక్రవారం యూఏఈ రాజధాని అబుదాబిలోని గ్యాస్‌ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ క్షిపణులను యూఏఈ ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకున్నాయి. దీంతో క్షిపణి శకలాలు కిందపడటంతో 12 మందికి గాయపడ్డారు. ఈ విషయాన్ని అబుదాడి మీడియా కార్యాలయం వెల్లడించింది.
Also Read: అమెరికా యుద్ధ విమానాలు నేటమట్టం.. పైలట్ కోసం ఇరాన్ గాలింపు
ఈ 12 మందిలో అయిదుగురు భారతీయులు ఉన్నట్లు తెలిపింది. మిగతా ఆరుగురు నేపాల్ పౌరులని పేర్కొంది. ప్రస్తుతం వాళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారని అబుదాబి మీడియా తెలిపింది. మార్చి 26న కూడా అబుదాబిలోని స్వీహాన్ ప్రాంతంలో క్షిపణి శకలాలు పడ్డాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో ఒకరు భారతీయుడు కాగా మరోకరు పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి.
INDIANS INJURED IN ABU DHABI
— Nabila Jamal (@nabilajamal_) April 3, 2026
Five Indian nationals and six Nepali nationals injured in Abu Dhabi's Ajban area after debris fell from an intercepted projectile on Friday, leaving one Nepali national seriously injured
Earlier today, a fire had broken out at a gas facility in the… pic.twitter.com/ZJTJwp0LpW
Also Read: పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్.. భారత్ లో మందుబాబులకు BIG షాక్!
ఇదిలాఉండగా కువైట్‌లోని ప్రధాన చమురుశుద్ధి కర్మాగారమైన మీనా అల్-అహ్మదిపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది. దీంతో అక్కడ భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశాయి. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ వెల్లడించింది. అయితే ప్రపంచంలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో కువైట్‌లో ఉన్న మీనా అల్-అహ్మది కూడా ఒకటి. కువైట్‌లో ఉత్పత్తి అయ్యే చమురుకు ఈ కర్మాగారం చాలా కీలకం. దీన్ని టార్గెట్ చేసుకోని ఇరాన్ దాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
🇮🇷🇰🇼 Another angle of Kuwait's Mina Al-Ahmad oil refinery after getting struck by Iranian Shahed-136 drones pic.twitter.com/A2MMF7G8EW
— Global Conflict Tracker (@Kiraguri254) April 3, 2026
Follow Us