/rtv/media/media_files/2025/02/06/dNpyQerYUBLaTGkdK4rw.jpg)
us women to pakisthan Photograph: (us women to pakisthan)
US Woman Viral News: ఈమెది షాజహాన్ కంటే గొప్ప ప్రేమ అనే చెప్పాలి. తాజ్ మహాల్ కట్టలేకపోవచ్చు కానీ.. ప్రియుడి కోసం కన్న కొడుకుని, కట్టుకున్న వాడిని కాదని ఖండాలు దాటొచ్చే దైర్ఘ్యం, ప్రేమ రెండూ ఆమె దగ్గరన్నాయి. 33ఏళ్ల ఒనిజా ఆండ్రూ రాబిన్సన్ ఆన్‌లైన్‌లో పరిచమైన లవర్(Online Love) కోసం అమెరికా(America) నుంచి పాకిస్థాన్(Pakistan) వచ్చేసింది. ఇలాంటివి విన్నప్పుడు, చూసినప్పుడూ ప్రేమ గుడ్డిది అనే మాట గుర్తుకోస్తోంది. ఆ మహిళ 19 ఏళ్ల నిడాల్ అహ్మద్ మెమన్‌ను కలవడానికి న్యూయార్క్(New York) నుంచి కరాచీ(Karachi)కి వచ్చింది. అహ్మద్ మెమన్ కుటుంబసభ్యులు వారి ప్రేమను అంగికరించలేదు. ఆమె అతన్ని పెళ్లి చేసుకుందామనుకుంది. కానీ యువకుడి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.
Also Read: Mastan Sai : డ్రగ్స్ ఇస్తాడు.. న్యూడ్ వీడియోలు తీస్తాడు.. మస్తాన్ మాములోడు కాదయ్యా!
ఒనిజా ఆండ్రూ రాబిన్సన్ రోజూ అహ్మద్ మెమన్ ఇంటి ముందు నిలబడి అతని కోసం ఎదురుచూస్తూ ఉండేది. అలా ఆమె టూరిస్ట్ వీసా(Tourist Visa) గడువు కూడా అయిపోయింది. దీంతో ఆమె పాకిస్థాన్‌లోనే ఉండాల్సి వచ్చింది. దీంతో కరాచీలోని మెమన్ ఇంటి ముందు మకాం వేసింది. పాకిస్తాన్‌లో సామాజిక కార్యకర్త, యూట్యూబర్ జాఫర్ అబ్బాస్ సోషల్ మీడియాలో రాబిన్సన్ గురించి వీడియో చేసి ఆమె పరిస్థితిని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాడు. సింధ్ గవర్నర్ కమ్రాన్ ఖాన్ టెస్సోరి స్పందించి ఆమెను అమెరికా పంపేందుకు సహాయం చేస్తానని ముందుకు వచ్చాడు. ఒనిజా ఆండ్రూ రాబిన్సన్ తిరిగి అమెరికా వెళ్తేందుకు ఏర్పాటు చేయమని అధికారులను ఆదేశించాడు.
🇵🇰🇺🇸American Woman Demands $100k from Pakistan to ‘Rebuild’ Country After Online Romance Falls Apart
— AI Day Trading (@ai_daytrading) February 4, 2025
Onijah Andrew Robinson flew to Pakistan to marry her 19-year-old boyfriend, whom she met online. But when she arrived, the man dumped her.
💰 Undeterred, Robinson overstayed her… pic.twitter.com/5QZplRaTpw
Also Read: Sekhar Basha: శేఖర్ బాషాకు బిగ్ షాక్.. మరో కేసు నమోదు..
3వేల డాలర్లు భరణం డిమాండ్...
ఆమె అమెరికా వెళ్లేందుకు ఒప్పుకోలేదు. ఆమెరికా వెళ్లాలంటే ఆమెకు కొన్ని డిమాండ్లు ఉన్నాయని చెప్పింది. ప్రెస్‌మీట్ పెట్టి ఆల్‌రెడీ ఆమెకు మెమన్‌తో పెళ్లి అయినట్లు, తనకు అతని నుంచి వారానికి 3వేల డాలర్లు భరణం కావాలని డిమాండ్ చేసింది. మెమన్‌తోపాటు త్వరలోనే దుబాయ్ వెళ్లి ఫ్యామిలీని ఏర్పాటు చేసుకుంటానని ఒనిజా ఆండ్రూ రాబిన్సన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మరికొన్ని రోజుల తర్వాత ఆమె కోరికలు కొండెక్కాయి. నిడాల్ అహ్మద్ మెమన్ నుంచి వారానికి 20వేల డాలర్లు, పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి లక్ష డాలర్లు ఆమెకి ఇచ్చి న్యాయం చేయాలని కోరింది. ఇంత డబ్బు ఎందుకు, ఏం చేస్తావని ఆమెను మీడియా అడిగినప్పుడు నా వ్యవహారాలన్నీ మీ అందరికీ చెప్పడం నా మతానికి విరుద్ధమని చెప్పింది.
Also Read: సీఎం రేవంత్ పై తిరగబడ్డ మంత్రి.. ఆ ఎమ్మెల్యేతో కలిసి ఖర్గేతో చర్చలు.. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?
వెంట వెంటనే మార్చుతున్న ఆమె మాటలు చూసి అందరికీ ఆశ్చర్యం కలిగింది. దీంతో ఆమె కుటుంబ నేపథ్యం కనుక్కొని వారికి తెలియజేశారు. అయితే రాబిన్సన్ కొడుకు జెరెమియా ఆండ్రూ రాబిన్సన్, తన తల్లికి బైపోలార్ డిజార్డర్ ఉందని చెప్పాడు. అంతేకాదు ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతుందని వివరించాడు. వారు కూడా ఆమెను అమెరికా తిరిగి రావాలని కోరారు. అయినా సరే ఆమె అమెరికా వెళ్లడం లేదు. పట్టబట్టి మెమన్ ఇంటి ముందే కూర్చొని కాసేపు తనని పెళ్లి చేసుకుంటానని, మరికాసేపు అతని నుంచి భరణం కావాలని డిమాండ్ చేస్తోంది.